విపణిలోకి అధునాతన రంగుల్లో సుజుకి హయబుసా విడుదల

Written By:

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 2017 ఏడాదికి గాను తమ హయబుసా హైపర్‌బైక్‌ని నూతన రంగుల్లో విడుదల చేసింది. సరికొత్త హయబుసాకు రీఫ్రెష్డ్ పెయింట్ స్కీమ్‌తో ఆకర్షణీయమైన రంగులను అద్దారు.

2017 సుజుకి హయబుసా లో నూతనంగా పరిచయమైన రంగులు

  • గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ విత్ పియర్ల్ గ్లాసియర్ వైట్
  • పియర్ల్ విగోర్ బ్లూ విత్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
  • గ్లాస్ స్పార్కిల్ బ్లాక్

దిగుమతి చేసుకుంటున్న సుజుకి హయబుసా ప్రారంభ ధర రూ. 13.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి పెద్ద డీలర్ల వద్ద ఈ హయబుసా ఫ్లాగ్‌షిప్ బైకులు అందుబాటులో ఉన్నాయి.

సుజుకి తమ అనుభవం ప్రకారం గుర్గావ్ ప్లాంటు నుండి వినియోగదారులకు అత్యధిక వేగంగా డెలివరీ ఇవ్వడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లైనప్‌లో జిఎస్ఎక్స్-1000ఎఫ్, జిఎస్ఎక్స్-ఎస్1000, జిఎస్ఎక్స్-ఆర్1000, వి-స్ట్రామ్ 1000, హయబుసా, ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరియు ఎమ్1800ఆర్ B.O.S.S ఎడిషన్ అనే ఉత్పత్తులు ఉన్నాయి.

English summary
2017 Suzuki Hayabusa Launched; Three New Colours Revealed
Story first published: Tuesday, November 8, 2016, 15:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos