హ్యార్లీ డేవిడ్‌సన్ నుండి మొదటి ఎలక్ట్రిక్ బైక్

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైకును అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచ రహదారుల్లో దీనితో చక్కర్లు కొట్టడానికి సుమారుగా ఐదేళ్ల సమయం పట్టనున్నట్లు కూడా హ్యార్లీ ప్రకటించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యార్లీ నుండి ఎలక్ట్రిక్ బైక్

హ్యార్లీ డేవిడ్‌సన్ అంతర్జాతీయ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీన్ కమ్మింగ్స్ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార వార్తా సంస్థ మిల్వాకీ తో జరిగిన ముఖాముకి చర్చలో మాట్లాడుతూ, హ్యార్లీ డేవిడ్‌సన్ 2020 నాటికి మొదటి ఎలక్ట్రిక్ బైకును ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైకు యొక్క ప్రాజెక్ట్ గురించి వివరించగానే దీనికి ప్రముఖ పోటిదారైన విక్టరీ మోటార్ సైకిల్స్ ఇప్పటికే స్వంత పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ బైకుల అభివృద్ది మీద దృష్టి సారించింది.

క్రూయిజ్ నౌకల ప్రయాణం వెనుకున్న 10 చీకటి రహస్యాలు

దీనికంటే ముందుగా హ్యార్లీ డేవిడ్‌సన్ సంస్థ కొన్నేళ్ల క్రితం లైవ్‌వైర్ అనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రదర్శించింది. అయితే దీని మీద వినియోగదారుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పరీక్షల కోసం వెనక్కి పంపింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి విడుదల చేస్తారా ? లేదా ? అనే విషయం తేలాల్సి ఉంది. ఇంత వరకు దీని మీద హ్యార్లీ డేవిడ్‌సన్ సంస్థ నుండి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి ఎనిమిది కొత్త కార్లు

2014 లో మొదటి సారిగా హ్యార్లీ డేవిడ్‌సన్ మనం మాట్లాడురకుంటున్న లైవ్‌వైర్ అనే ఎలక్ట్రిక్ బైకును ప్రదర్శించింది. అప్పట్లో దీని ధర సుమారుగా 50,000 డాలర్లుగా ఉన్నట్లుగా అంటే 33.5 లక్షలుగా ప్రకటించారు. ఈ లైవ్‌వైర్ బైకులో అందించిన త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్‌ సుమారుగా 74 బిహెచ్‌పి పవర్ మరియు 70 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

English summary
First Electric Harley-Davidson Bike To Launch By 2020
Story first published: Tuesday, June 14, 2016, 17:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

X