సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు

By Anil

యురి ఘటనకు ప్రతీకారంగా మిలిటరీ విభాగం పాక్ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విజయంవంతంగా ముగిస దేశ ప్రజల మన్ననలు పొందింది. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భూ భాగంలో ఇండియన్ మిలిటరీ చేసిన ఆసాధారణ దాడుల్లో సుమారుగా 40 మంది వరకు ఉగ్రవాదులను హతం అయ్యారు. ఉగ్ర వాదుల క్యాంపుల్లోని వారందరినీ దాదాపుగా నిర్మూలించారు.

ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులను నిర్మూలించడానికి కమాండో ధళాలకు ధృువ్ హెలికాప్టర్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇండియన్ మిలిటరీ సైనికులు శత్రు భూ బాగంలోకి ల్యాండ్ అయ్యి ధైర్యంగా దాడుల నిర్వహించడంలో ధృువ్ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. నేటి మన విమానాలు శీర్షిక ద్వారా ధృువ్ హెలికాప్టర్ల గురించి ఆసక్తికరమైన విషయాలు....

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

భారత ప్రభుత్వాధీనంలో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌గా ధృువ నక్షత్రం ఆధారంగా ధృువ్ హెలికాప్టర్‌ను రూపొందించింది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

FAR 2009 ప్రమాణాలకు అనుగుణంగా 2000సిరీస్ ఉత్పత్తి ద్వారా ప్రొడక్షన్‌ చేయడం మొదలు పెట్టారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఈ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌ను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్ మరియు సివిల్ ఆపరేషన్ల కోసం దీనిని విరివిగా వినియోగించుకుంటున్నారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

హెచ్‌ఏఎల్ అభివృద్ది చేసిన ఈ లైట్ అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్‌ను పగలు మరియు రాత్రి సమయాల్లో విభిన్న అవసరాలకు మరియు దాడులకు తెగబడటానికి వినియోగించుకోవచ్చు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

డిజైన్ పరంగా ఇది పూర్తిగా సాంప్రదాయ పద్దతిలో డిజైన్ చేయబడింది. బాడీ నిర్మాణం పరంగా మిగతా వాటితో పోల్చుకుంటే 2/3 వ వంతు తక్కువ బరువును కలిగి ఉంటుంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

నాలుగు రెక్కలు గల ముఖ్యమైన రోటార్ కలదు. మ్యాన్యువల్‌గా దీని రెక్కలను మడవచ్చు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఫైబర్ ఎలాస్టోమర్‌తో నిర్మించిన రోడార్ హెడ్ మీద బ్లేడ్లను క్రాస్ గుర్తులో ఉన్న కార్బన్ ఫైబర్ రీయింన్‌ ఫోర్స్‌డ్ ప్లాస్టిక్‌తో రూపొందించారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ధృువ్ హెలికాప్టర్లో అదుర్లను నియంత్రించడానికి లార్డ్ కార్పోరేషన్ ఆఫ్ నార్త్ కరోలినా వారు అభివృద్ది చేసిన ఆక్టివ్ వైబ్రేషన్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ధృువ్ లో అందించిన సెన్సార్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, సమాచార సిగ్నలింగ్ వంటి వాటిని పర్యవేక్షిస్తుంటుంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

పైలట్ కూర్చునే కాక్‌పిట్‌ను కెవ్లర్ మరియు కార్బన్ ఫైబర్ పదార్థంతో డిజైన్ చేసారు. ఇందులో నాలుగు దిక్కుల ఆటోమేటిక్ ప్లైట్ కంట్రోల్ వ్యవస్థ కలదు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

సాంకేతికంగా ఇందులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, డాప్లర్ న్యావిగేషన్ సిస్టమ్, దూరాన్ని కొలిచే పరిజ్ఞానం, గాలి వేగాన్ని లెక్కించే పరికరం, ఆటోమేటిక్‌గా దిశను కనిపెట్టే పరికరం, రేడియో ఆల్టీ మీటర్ మరియు ఇంస్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్‌తో పాటు అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

కమ్యూనికేషన్ కోసం ఇందులో హెచ్‌ఎఫ్, యుహెచ్‌ఎఫ్, మరియు విహెచ్‌ఎఫ్ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ లలో వినియోగించే ధృువ్ హెలికాప్టర్‌లు సుమారుగా ఎనిమిది యాంటి ఆర్మర్ మిస్సైల్స్, నాలుగు ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, లేదంటే నాలుగు 70ఎమఎమ్ రాకెట్ పోడ్‌లను మరియు 68ఎమ్ఎమ్ రాకెట్లను మోసుకెళ్లగలదు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆయుధ బలం కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ వెపన్ సిస్టమ్‌ను ప్రత్యేకించి ఇండియన్ ఆర్మీ అవసరాలకు వినియోగించే హెలికాప్టర్లలో అందిస్తున్నారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇన్‌ఫ్రారెడ్ కిరణాల సహాయంతో ప్రయోగించ గల సుమారుగా నాలుగు కిలోమీటర్ల రేంజ్ ఉన్న నాగ్ మిస్సైల్స్‌ను ఇందులో వినియోగించేందుకు భారత దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రయాగాలు చేస్తోంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ధుృవ్ హెలికాప్టర్‌లో నాగ్ యాంటి ట్యాంక్ మిస్సైల్ కలదు, మరియు ఇందులో లక్ష్యం యొక్క దూరాన్ని, అక్కడి ఉష్ణ మరియు వేడి పరిస్థితులను, లేజర్ యొక్క రేంజ్‌ను గుర్తించ గల కెమెరాలను అందించారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ధృువ్ హెలికాఫ్టర్‌ల యొక్క క్యాబిన్ డిజైన్ పలు రకాలుగా ఉంది. 12 నుండి 14 మంది ప్రయాణించ గల సామర్థ్యం ఈ హెలికాఫ్టర్లలో ఉంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

భారత దేశపు రక్షణ రంగానికి వివిధ రకాలుగా ఉపయోగపడే అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లో టర్బోమెకా టిఎమ్ 333-2సి లేదా 2బి2 అనే రెండు ఇంజన్‌లను అందించారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ధృువ్ హెలికాఫ్టర్‌లోని ఇంజన్ సుమారుగా టేక్ ఆఫ్ కోసం 740కిలోవాట్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీ లలో వినియోగించే హెలికాప్టర్లలో నాన్-రిట్రాక్టబుల్ మెటల్ స్కిడ్ ల్యాండింగ్ గేర్ ఇందులో అందించారు. మరియు అన్ని ధృువ్ హెలికాఫ్టర్లలో కూడా తోక భాగంలో ఉన్న తిరిగే ఫ్యాన్ ప్రమాదానికి గురి కాకుండా టెయిల్ స్కిడ్ ను అందించారు.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

భారత తివిధ ధళాల్లో వినియోగిస్తున్న ధుృవ్ మల్టీ రోల్ అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్ ఒక్క దాని ధర సుమారుగా రూ. 40 కోట్ల వరకు ఉంది.

ధుృవ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

  • చైనాకు చుక్కలు చూపిస్తున్న భారత సైన్యం: హ్యాట్సాఫ్‌ టు ఇండియన్ ఆర్మీ
  • పాక్ ఉగ్ర మూకల అంతం కోసమేనా...?
  • ప్రమాదకర శత్రువుల అంతానికి ఈ ఐదు ఎంతో కీలకం

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Facts Dhruv Advanced Light Helicopter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X