గమ్మత్తైన గస్టో 125 మార్కెట్లోకి విడుదల: ధరను మించిన ఫీచర్లతో అందుబాటులోకి

Posted By:

మహీంద్రా అండ్ మహీంద్రా టూ వీలర్ల సెగ్మెంట్లలోకి సరికొత్త గస్టో 125 స్కూటర్‌ను బెంగళూరు కేంద్రంగా నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 50,680 ఎక్స్ షోరూమ్ బెంగళూరుగా విడుదల చేసింది. తక్కువ ధర మరియు ఎక్కువ ఫీచర్లతో దీనిని మార్కెట్లోకి విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్రింద గల స్లైడర్ల మీద ఓ లుక్కేయండి.

గస్టో లభించు వేరియంట్లు

గస్టో లభించు వేరియంట్లు

మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసిన గస్టో 125 స్కూటర్‌ను రెండు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.

  • గస్టో 125 డిఎక్స్ ధర రూ. 50,680 లు
  • గస్టో విఎక్స్ ధర రూ. 53,680 లు

రెండు ధరలు ఎక్స్ షోరూమ్ బెంగళూరుగా ఉన్నాయి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మహీంద్రా వారి గస్టో 125 స్కూటర్‌లో 124.6సీసీ కెపాసిటి గల ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

పవర్ వివరాలు

పవర్ వివరాలు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సస్పెన్షన్ సిస్టమ్

సస్పెన్షన్ సిస్టమ్

మహీంద్రా వారు ఫీచర్లలో భాగంగా ఈ గస్టో 125 శ్రేణి స్కూటర్లలో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

టైర్లు మరియు చక్రాలు

టైర్లు మరియు చక్రాలు

గస్టో 125 స్కూటర్లలో 12-అంగుళాల చక్రాలకు ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

లభించు రంగులు

లభించు రంగులు

మహీంద్రా వారి గస్టో 125 స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును.

  • ఆరేంజ్ రష్
  • బోల్ట్ వైట్
  • మోనార్క్ బ్లాక్
  • రీగాల్ రెడ్
డిజైన్

డిజైన్

డిజైన్ స్కూటర్ అనగా చూడాల్సిన మొదటి అంశం డిజైన్. మీరు దీని మొత్తం బాడీని పరిశీలించినట్లయితే చాలా చిన్నగా ఉంటుంది. మరియు ముందు వైపు లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది.ఇది చూడటానికి యూత్ ఫుల్‌గా మరియు స్పోర్టివ్ గా ఉంది.

సీటు అడ్జెస్ట్ ఫీచర్

సీటు అడ్జెస్ట్ ఫీచర్

గస్టో 125 లో మహీంద్రా వారు పరిచయం చేసిన సీటు ఎత్తు సరిచేసుకునే ఫీచర్ మిగతా ఏ 125 సీసీ స్కూటర్‌లో కూడా లేదు. ఈ ఫీచర్ వలన మీరు సీటును మీ ఎత్తుకు తగిన విధంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ సీటు మీద రైడ్ చేస్తున్నంత సమయం పాటు విశ్రాంతి తీసుకున్నటువంటి అనుభూతిని పొందుతారు.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు

  • రిమోట్ ఫ్లిప్ కీ
  • ఫైండ్ మి ల్యాంప్స్
  • హ్యాలోజిన్ హెడ్ ల్యాంప్స్
  • సులభంగా ఉండటానికి ముందు వైపు కల్పించిన కిక్
పోటి

పోటి

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఆక్టివా 125 మరియు సరికొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లకు పోటీ నిలవనుంది.

మరిన్ని స్టోరీలు...

English summary
Mahindra Gusto 125 Launched In Bangalore, Prices Start At Rs. 50,680

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark