దేశవ్యాప్తంగా 15 నగరాలలో మహీంద్రా మోజో విడుదల
మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ స్పోర్ట్స్ బైకుల మార్కెట్లోకి విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ బైకును రెండు తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న 15 నగరాలలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మహీంద్రా ప్రకటించింది.
మహీంద్రా వారి మోజో బైకు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్రా వారి స్పోర్ట్స్ ఫ్లాగ్ షిప్ బైకు 300సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇది దాదాపుగా 27 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మోజో బైకును దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలలో గల 15 నగరాలలోని 23 షోరూమ్‌లలో విడుదల చేశారు. వీటికి సంభందించిన ధరలను తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

మహీంద్రా మోజో ధరలు
- విజయవాడ - ఆంధ్రప్రదేశ్ ధర రూ. 1,69,600
- విశాఖ పట్టణం - ఆంధ్రప్రదేశ్ ధర రూ. 1,69,600
- హైదరాబాద్ - తెలంగాణ ధర రూ. 1,69,600
- మహీంద్రా మోజో రివ్యూ : పూర్తి వివరాలు

మహీంద్రా మోజో ధరలు
చంఢీఘర్ - చంఢీఘర్ ధర రూ. 1,66,600
గుర్గావ్ - హర్యానా ధర రూ. 1,63,600
గోవా - గోవా ధర రూ. 1,65,500

మహీంద్రా మోజో ధరలు
అహ్మదాబాద్ - గుజరాత్ ధర రూ. 1,71,800
ఇండోర్ - మధ్య ప్రదేశ్ ధర రూ. 1,75,120
జైపూర్ - రాజస్థాన్ ధర రూ. 1,69,900

చెన్నై - తమిళనాడు ధర రూ. 1,71,600
కోయంబత్తూరు - తమిళనాడు ధర రూ. 1,71,600
మధురై - తమిళనాడు ధర రూ. 1,71,600

నాగ్‌పూర్ - మహరాష్ట్ర ధర రూ. 1,65,500
లక్నో - ఉత్తర్ ప్రదేశ్ ధర రూ. 1,69,200
కలకత్తా - పశ్చిమ బెంగాల్ ధర రూ. 1,70,000



Click it and Unblock the Notifications








