కొత్త తరం హయాబుసాతో సిద్దమైన సుజుకి

Written By:

సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా తమ నెక్ట్స్ జనరేషన్ హయాబుసా బైకును సిద్దం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని 2017 లో విడుదల చేయడానికి ఏర్పాట్లను కూడా సమీక్షిస్తోంది. అప్‌డేటెడ్ వర్షన్‌లో రానున్న నెక్ట్స్ జనరేషన్ సుజుకి హయాబుసా గురించి మరిన్ని వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి హయాబుసా

సుజుకి ఇంజనీర్లు ప్రస్తుతం ఉన్న హయాబుసా మోడల్ ఆధారంగా నెక్ట్స్ జనరేషన్ హయాబుసాను అభివృద్ది చేస్తున్నట్లు సుజుకి ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి తెలిపాడు.

సుజుకి హయాబుసా

తమ నెక్ట్స్ జనరేషన్ సుజుకి హయాబుసా గురించి సంస్థ విడుదల చేసిన తొలి ప్రకటన ఇదే, సుజుకి కథనం ప్రకారం రైడింగ్‌ మరింత సులభమయ్యేందుకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందిస్తున్నట్లు మరియు ఇందులో ఏడు రకాల రైడింగ్ మోడ్స్ ఉన్నట్లు కూడా సుజుకి స్పష్ట చేసింది.

సుజుకి హయాబుసా

గతంలో 2008 లో విడుదలైన మోడల్‌కు సెకండ్ జనరేషన్‌గా సరికొత్త 2017 హయాబుసాను ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి అసెంబుల్ దేశీయంగానే నిర్వహిస్తోంది.

సుజుకి హయాబుసా

సుజుకి హయాబుసా స్పోర్ట్స్ బైకులో 1,304సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ డిఒహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ కలదు.

సుజుకి హయాబుసా

సుజుకి హయాబుసాలోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 194బిహెచ్‌పి పవర్ మరియు 155ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

సుజుకి హయాబుసా

దేశీయ లైనప్‌లో భారీ సంఖ్యలో స్పోర్ట్స్ బైకులను అందుబాటులో ఉంచిన సుజుకి తమ సరికొత్త జిఎస్ఎక్స్-ఆర్1000 మోడల్ బైకును ఈ ఏడాది జరిగిన ఇంటర్‌మోట్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. ఇందులోని ఫీచర్లను కొన్నింటిని 2018 సుజుకి హయాబుసా పంచుకునే అవకాశం ఉంది.

సుజుకి హయాబుసా

భారీ ఆకృతిలో ఉన్న హయాబుసా తరహాలో కాకుండా కాస్త తక్కువ పరిమాణంలో, ప్రస్తుతం 266కిలోల బరువుగా ఉన్న హయాబుసా కన్నా తక్కువ బరువుతో నెక్ట్స్ జనరేషన్ హయాబుసా రానుంది.

సుజుకి హయాబుసా

సుజుకి నెక్ట్స్ జనరేషన్ 2018 హయాబుసా విడుదల తారీఖుని ఇంకా స్పష్టం చేయలేదు. సుజుకి ఈ నెక్ట్స్ జనరేషన్ హయాబుసాను వచ్చే ఏడాదిలో జరగనున్న ఎకిమా మరియు టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

సుజుకి హయాబుసా

తాజా ఆటోమొబైల్ కథనాలను ఎప్పటికప్పుడు తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండి. సాంఘిక మాధ్యమాలైన ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో డ్రైవ్‌స్పార్క్ తెలుగు

 
English summary
Next-Generation Suzuki Hayabusa To Debut In 2017
Story first published: Thursday, December 1, 2016, 13:51 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark