సుజుకి నుండి జిఎస్ఎక్స్150ఆర్ 150సీసీ బైకు

Written By:

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలోకి ఉత్తమ పనితీరును కనబరిచే 150సీసీ సామర్థ్యం గల బైకును సిద్దం చేస్తోంది. దీనికి జిఎస్ఎక్స్150ఆర్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.

సుజుకి 150సీసీ సెగ్మెంట్లోకి అందివ్వనున్న ఈ పేరు మరియు దీని డిజైన్‌ను పరీశీలిస్తే జిక్సర్ లక్షణాలతో ఇది తయారైనట్లు స్పష్టం అవుతోంది.

సుజుకి ఈ జిఎస్ఎక్స్150ఆర్ ను నలుపు మరియు తెలుగు రంగుల ముసుగులో ఎవరూ గుర్తించకుండా అత్యంత రహస్యంగా పరీక్షించింది.

సుజుకి ఈ జిఎస్ఎక్స్150ఆర్ బైకును ప్రారంభంలో ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల చేయనుంది. తరువాత దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి మార్గం సుగమం చేయనుంది.

డిజైన్ పరంగా జిఎస్ఎక్స్ చాలా పెద్దగా ఉంది. పదునైన హెడ్ ల్యాంప్స్ మరియు అంచులు అత్యంత పదునుగా ఉండే డీకాల్స్ ఇందులో అందించారు.

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ వారు ఈ జిఎస్ఎక్స్150ఆర్ లో రెండు వైపులా డిస్క్ బ్రేకులను అందించారు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేశారు.

సుజుకి ఇంతకు మునుపు జిక్సర్ శ్రేణి ఉత్పత్తుల్లో వినియోగించిన అదే 155సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను ఈ జిఎస్ఎక్స్150ఆర్ లో అందిస్తోంది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 14.6బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. మునుపటి ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది ఉత్తమ పనితీరును కనబరుచును.

జిక్సర్ శ్రేణి ఉత్పత్తులకు ధీటుగా పనితీరును ప్రదర్శించడానికి ఇందులోని ఇంజన్‌కు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. తద్వారా ఇంజన్‌ ఉత్పత్తి చేసే అధిక వేడిని అదుపులో ఉంచవచ్చు.

ఆన్ లైన్ సెర్చింగ్ దీని జిక్సర్ 250 మోడల్ గురించి భారీగా శోధిస్తున్నారు, ఇదే సమయంలో మార్కెట్లోకి ఈ జిఎస్ఎక్స్150ఆర్ విడుదల అయితే జిక్సర్ శైలిలో ఉన్న ఈ బైకు ఔత్సాహికులకు ఓ వరం అని చెప్పవచ్చు.

రానున్న నెలల్లో సుజుకి ఈ జిఎస్ఎక్స్150ఆర్ ను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. దేశీయంగా విడుదల అయితే ఇప్పటికే 150సీసీ సెగ్మెంట్లో ఉన్న ఉత్పత్తులకు గట్టి పోటీగా సృష్టించనుంది.

సుజుకి మోటార్ సైకిల్స్ జిఎస్ఎక్స్150ఆర్ కు రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నపుడు తీసిన వీడియో....

  

English summary
Suzuki GSX-150R — Suzuki’s 150CC Performance Motorcycle In The Making
Story first published: Friday, September 23, 2016, 19:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos