ఆగష్టు అమ్మకాల్లో సంచనాలు సృష్టించిన బైకులు ఇవే

Written By:

భారత దేశపు టూ వీలర్ల సెగ్మెంట్లో అత్యంధిక అమ్మకాలు సాధించిన వాటిలో మొదటి స్థానంలో ఎప్పటిలాగే జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా నిలిచింది. దేశీయంగా ప్రతి నెలా టూ వీలర్ల అమ్మకాల్లో ఈ ఏడాది ఎనిమిదివ మాసం విజయవంతమైన ఫలితాలను అందించింది. ప్రతి సంస్థకు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి.

గడిచిన 2016 ఆగష్టు నెలలో భారతీయులు అత్యధికంగా ఎంచుకున్న టూ వీలర్లు మరియు వాటి పూర్తి వివరాలు ...

10. బజాజ్ సిటి

10. బజాజ్ సిటి

బజాజ్ వారి బడ్జెట్ ఫ్రెండ్లీ బైకు సిటి గడిచిన 2016 ఆగష్టు మాసంలో 44,599 యూనిట్లు అమ్మకాలు సాధించింది. అంతకు మునుపు ఇదే మాసంలో 38,412 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అమ్మకాల్లో వృద్ది 16 శాతంగా ఉంది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

బజాజ్ ఆటో సంస్థ ఇందులో 99.27 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించారు. ఇది 9.1 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు లీటర్‌కు 89 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వనున్నట్లు ఏర్‌ఏఐ తెలిపింది. బజాజ్ సిటి100 ధర రూ. 35,034 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

09. బజాజ్ పల్సర్

09. బజాజ్ పల్సర్

బజాజ్ సంస్థకు మరో ఉత్పత్తి పల్సర్ ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగష్టులో 52,193 యూనిట్ల అమ్మకాలు సాధించగా ఈ ఏడాది అదే మాసంలో 48,910 యూనిట్ల సాధించి 6 శాతం వృద్దిని కోల్పోయింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

బజాజ్ పల్సర్ లోని టాప్ మోడల్ అయిన ఆర్‌ఎస్ 200 లో 199.5సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ కలదు ఇది 24.1 బిహెచ్‌పి పవర్, 18.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు 35 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. పల్సర్‌లోని ప్రారంభ వేరియంట్ 135 ఎల్ఎస్ ధర రూ. 63,269 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.

08. టీవీఎస్ జూపిటర్

08. టీవీఎస్ జూపిటర్

స్వదేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం టీవీఎస్‌కు చెందిన జూపిటర్ స్కూటర్ గత ఏడాది ఇదే ఆగష్టు నెలలో 46,614 యూనిట్ల అమ్మకాలు సాధించగా ఈ ఏడాది ఆగష్టు మాసంలో 51,728 యూనిట్ల అమ్మకాలు జరిపి 11 శాతం వృద్దితో ఎనిమిదవ స్థానంలో నిలిచింది

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

జూపిటర్‌ స్కూటర్‌లో 109.7సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిడర్ ఇంజన్‌ కలదు. ఇది 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు లీటర్‌కు 62 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ. 48,809 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

07. సిబి షైన్

07. సిబి షైన్

హోండాకు చెందిన సిబి షైన్ గత ఏడాది ఆగష్టు నెలలో 63,590 యూనిట్ల అమ్మకాలు జరపగా ఈ యేడు అదే మాసంలో 63,606 యూనిట్లు అమ్మకాలు జరిపి 0.03 శాతం వృద్దిని కోల్పోయి ఏడవ స్థానంలో నిలిచింది.

 ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హోండా ఈ షైన్ బైకులో 124.7సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది 10.57 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. హోండా సిబి షైన్ ధర రూ.55,559 ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

06. హీరో గ్లామర్

06. హీరో గ్లామర్

హీరో మోటోకార్ప్‌కు చెందిన గ్లామర్ గత ఏడాది ఆగష్టు నెలలో 55,944 యూనిట్ల అమ్మకాలు సాధించగా ఈ యేడు అదే మాసంలో 74,693 యూనిట్ల అమ్మకాలు జరిపి 34 శాతం వృద్దితో ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో ఇందులో 124.8 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించింది. ఇది 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 10.53 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 55 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

గ్లామర్‌లో కార్బొరేటర్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. కార్బోరేటెడ్ గ్లామర్ వేరియంట్ ధర రూ. 55,925 లు మరియు ఫ్యూయల్ ఇంజెక్టెజ్ గ్లామర్ వేరియంట్ ధర రూ. 65,600 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

05. ఎక్స్ఎల్ సూపర్

05. ఎక్స్ఎల్ సూపర్

టీవీఎస్ సంస్థ వారి మరొ ద్విచక్ర వాహనం ఎక్స్ఎల్ సూపర్ గత ఏడాది ఆగష్టులో 55,132 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. ఈ యేడు అదే మాసంలో ఏకంగా 75,435 యూనిట్లు అమ్ముడుపోయి, 37 శాతం వృద్దితో ఐదవ స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

టీవీఎస్ సంస్థ ఈ ఎక్స్‌ఎల్ మోపెడ్‌లను కేవలం 2-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 69.9 సీసీ గల ఇంజన్‌ మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఇంజన్ సుమారుగా 3.5 బిహెచ్‌పి పవర్ మరియు 5 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 26,857 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. (ఎక్స్ఎల్ ఇప్పుడు 100 సీసీ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది).

04. హీరో ప్యాసన్

04. హీరో ప్యాసన్

హీరో మోటోకార్ప్ యొక్క ప్యాసన్ గత ఏడాది ఆగష్టు నెలలో 81,529 యూనిట్లు అమ్మకాలు జరపగా ఈ యేడు ఆగష్టులో 77,581 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుని 5 శాతం వృద్దిని కోల్పోయి నాలుగవ స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో మోటోకార్ప్ ఇందులో 99.7 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 8.24 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌తో పాటు లీటర్‌కు 84 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. హీరో ప్యాసన్ రేంజ్ బైకుల ప్రారంభ ధర సుమారుగా రూ. 48,900 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరో మోటోకార్ప్‌ యొక్క మరొక ఉత్పత్తి హెచ్‌ఎఫ్ డీలక్స్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగష్టులో 80,871 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడాది అదే ఆగష్టు నెలలో 1,27,752 యూనిట్ల అమ్మకాలు జరిపి 58 శాతం వృద్దిని నమోదు.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇందులో ప్యాసన్‌లో వినియోగించిన ఇంజన్‌ను ఉపయోగించారు. తద్వారా పవర్,టార్క్ మరియు మైలేజ్ అన్ని కూడా ప్యాసన్‌ను పోలి ఉంటాయి. అయితే డిజైన్‌లో మార్పులు మనం గమనించవచ్చు. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ. 43,100 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

02. హీరో స్ల్పెండర్

02. హీరో స్ల్పెండర్

హీరో వారి వరుసగా మరో ఉత్తత్పి స్ల్పెండర్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగష్టులో 1,81,993 యూనిట్ల అమ్మకాలు సాధించగా, ఈ ఏడాది అదే మాసంలో ఏకంగా 2,29,061 యూనిట్ల అమ్మకాలు జరిపి 26 శాతం వృద్దిని సాధించింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో సంస్థ ఇందులో 99.7 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 8.24 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు 81 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. హీరో స్ల్పెండర్ ప్రారంభ ధర రూ. 46,500 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

01. హోండా ఆక్టివ్

01. హోండా ఆక్టివ్

హోండా గత ఏడాది ఆగష్టులో 2,17,819 యూనిట్ల అమ్మకాలు జరిపగా ఈ ఏడాది అదే ఆగష్టు నెలలో ఏకంగా 2,80,790 యూనిట్ల అమ్మకాలు జరిపి 29 శాతం వృద్దిని సాధించి ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హోండా ఆక్టివా లోని బేస్ మోడల్‌ను ఆక్టివా ఐ అని అంటారు. ఇందులో 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల 109.19 సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ కలదు. హోండా ఆక్టివా ప్రారంభ వేరియంట్ ధర రూ 46,213 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

 
English summary
Read In Telugu: Top 10 Best Selling Two Wheelers In August 2016
Please Wait while comments are loading...

Latest Photos