అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ విడుదల: ధర మరియు సాంకేతిక వివరాలు

అప్రిలియా తమ రేస్ ఎడిషన్ స్కూటర్ ఎస్ఆర్ 150 ని నేడు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మెకానికల్ మరియు ఎక్ట్సీరియర్ కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి.

By Anil

ఇటాలియన్ టూ వీలర్ల తయారీ సంస్థ అప్రిలియా తమ రేస్ ఎడిషన్ ఎస్ఆర్ 150 స్కూటర్‌ను రూ. 70,888 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా నేడు(ఫిబ్రవరి 09, 2017) విపణిలోకి విడుదల చేసింది. గత ఏడాది ఎస్ఆర్ 150 స్కూటర్‌ను రూ. 65,000 ల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలయిన రేస్ ఎడిషన్ స్కూటర్‌లో అనేక మార్పులు సంతరించుకున్నాయి.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో ఎలాంటి పోటీ లేకపోవడం, ఇటాలీకి చెందిన సంస్థ ధరకు తగ్గ విలువలతో శక్తివంతమైన ఇంజన్ మరియు ఫీచర్లను కలిగి ఉండటంతో అనతి కాలంలో మంచి విజయాన్ని అందుకొన్ని భారీ విక్రయాల బాట పట్టింది. అయితే ఈ విజయాన్ని కొనసాగించడానికి ఎస్ఆర్ 150 స్కూటర్‌‌ను రేస్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

సరికొత్త ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ కొన్ని మెకానికల్ మరియు కాస్మొటిక్ మార్పులకు గురయ్యింది. అయితే డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. సాధారణ ఎస్ఆర్ 150 కన్నా విభిన్నంగా ఉండేందుకు మోటోజిపి ప్రేరితి ఎక్ట్సీరియర్ బాడీ డీకాల్స్ దీనికి అందివ్వడం జరిగింది.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

ఇంకా ఇందులో గుర్తించదగిన వాటిలో ఎరుపు రంగులో ఉన్న అల్లాయ్ వీల్స్, బంగారపు వర్ణంలో ఉన్న ముందు వైపు బ్రేక్ కాలిపర్, వెనుక వైపున సింగల్ రెడ్ కలర్ కాయిల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్వర్, కాళ్లు ఉంచుకునే ప్రదేశంలో మందమైన బ్లాక్ మ్యాట్ వంటివి ఉన్నాయి.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులో ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్ 154.4సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 10బిహెచ్‌పి పవర్ మరియు 11.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

అదనంగా ఇందులో 14-అంగుళాల పరిమాణం ఉన్న చక్రాలు, ముందు వైపున 220ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డిస్క్ బ్రేక్, వెనుక వైపున 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ కలదు, రెండు చక్రాలకు కూడా 120/70 కొలతల్లో ఉన్న టైర్లు కలవు.

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్

భారీగా అమ్ముడుపోతున్న అప్రిలియా ఎస్ఆర్ 150 యొక్క వివరణాత్మక ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు.

Most Read Articles

English summary
Aprilia SR 150 Race Edition Launched — The Most Powerful Scooter In India
Story first published: Thursday, February 9, 2017, 16:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X