బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ వేరియంట్ కోసం వేచి ఉన్నారా....?

Written By:

2018 ఏప్రిల్ నుండి 125సీసీ కన్నా అధిక ఇంజన్ కెపాసిటి ఉన్న బైకుల్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఏబిఎస్ ఫీచర్ ఉండటం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసం ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో తమ ఎన్ఎస్ 200 మోటార్ సైకిల్‌లో వచ్చే ఏడాది ప్రారంభం నాటికి, గడువులోపే యాంటిలాక్ బ్రేకింగ్ ఫీచర్‌ను అందివ్వడానికి సిద్దమైంది.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌ ఫీచర్‌తో అమ్ముడవుతోంది. అయితే ఇండియన్ మోడల్ సింగల్ ఛానల్ ఏబిఎస్‌తో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ 200 కూడా సింగల్ ఛానల్ ఏబిఎస్‌తో లభించనుంది, ఆర్ఎస్200 ధర రెగ్యులర్ వేరియంట్ కన్నా రూ. 25,000 వరకు అధికంగా ఉండనుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

2020 నుండి భారత్ స్టేజ్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లతో మాత్రమే టూ వీలర్లను విక్రయించాల్సి ఉంటుంది. అందుకుగాను అన్ని టూ వీలర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల్లో బిఎస్-6 ఇంజన్‌లతో అప్‌గ్రేడ్స్ తప్పనిసరి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

2020 నాటికి బజాజ్ ఆటో తమ పల్సర్ ఎన్ఎస్ 200 మరియు పల్సర్ 220 మోటార్ సైకిళ్లను ఏబిఎస్, ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు బిఎస్-6 అప్‌గ్రేడెడ్ ఇంజన్‌తో ప్రవేశపెట్టనుంది. వీటి ధరలు రెగ్యులర్ మోడళ్ల కన్నా రూ. 10,000 నుండి రూ. 15,000ల మధ్య ఉండనుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఏబిఎస్ వేరియంట్ 199.5సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో రానుంది. ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న పల్సర్ ఎన్ఎస్200 లో కూడా ఇదే ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 23.2బిహెచ్‌ప్ పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? మరియు దాని ఉపయోగాలు...?

English summary
Read In Telugu: Bajaj Pulsar NS 200 ABS India Launch Details
Story first published: Saturday, July 29, 2017, 11:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark