కొత్త రంగుల్లో బజాజ్ ఆర్ఎస్200: డీలర్ల వద్దకు చేరిన బైకులు

స్టైలిష్ డిజైన్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫామెన్స్‌కు పేరుగాంచిన పల్సర్ ఆర్ఎస్200 ఈ పండుగ సీజన్ కోసం అధునాతన కలర్ ఆప్షన్స్‌లో విడుదలకు సిద్దమైంది.

By Anil

భారతదేశపు దిగ్గజ టూ వీలర్ల సంస్థ బజాజ్ ఆటో మొత్తానికి తమ రేసింగ్ స్పోర్ట్స్ బైకు పల్సర్ ఆర్ఎస్200ను సరికొత్త కలర్స్‌తో అప్‌డేట్స్ చేసింది. స్టైలిష్ డిజైన్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫామెన్స్‌కు పేరుగాంచిన పల్సర్ ఆర్ఎస్200 ఈ పండుగ సీజన్ కోసం అధునాతన కలర్ ఆప్షన్స్‌లో విడుదలకు సిద్దమైంది.

ఇప్పటికే డీలర్ల వద్దకు రహస్యంగా ఈ చేరిన ఈ బైకుల గురించి మరియు పల్సర్ ఆర్ఎస్200 లభించే కొత్త రంగుల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో....

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లలో డీలర్లను చేరుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డీలర్ల వద్ద సేకరించిన ఫోటోలు...

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

పట్టుపడిన రెండు మోడళ్లు రెండు సరికొత్త షేడ్‌లలో దర్శనమిచ్చాయి. మరియు ఈ రెండు కలర్ ఆప్షన్‌లు బజాజ్ పల్సర్ ఆర్ఎస్ లోని సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వేరియంట్లో మాత్రమే లభించనున్నట్లు తెలిసింది.

Recommended Video

Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

కొత్త పెయింట్ స్కీమ్‌తో ఆర్ఎస్200 బైకుల మీద ఉండే మునుపటి స్టిక్కరింగ్ పూర్తిగా మిస్సయ్యింది. దీంతో ఇవి బజాజ్ బైకులేనా అనే ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. అయితే, బజాజ్ తమ ఆర్ఎక్200 బైకులను తొలుత రెడ్ మరియు యెల్లో కలర్ ఆప్షన్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

తరువాత 2017 లో బజాజ్ ఆర్ఎస్200 బైకులను బిఎఎస్-4 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఈ మోడల్‌ను లేజర్ ఎడ్జ్ థీమ్‌కో సరికొత్త గ్రాఫైట్ బ్లాక్ మరియు రేసింగ్ బ్లూ పెయింట్ స్కీమ్‌లో ప్రవేశపెట్టింది. అయితే కొత్తగా వచ్చిన ఆరేంజ్ మరియు గ్రీన్ కలర్‌తో ఆర్ఎస్200 రీఫ్రెష్ లుక్‌ను సొంతం చేసుకుంది.

  • 8 లక్షల వరకు డిస్కౌంట్లు: భారీ దీపావళి ఆఫర్లతో ముందుకొచ్చిన పది మోడళ్లు
  • బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

    బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, ఇందులో 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 24బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

    కొత్త కలర్ స్కీములో పరిచయం అవుతున్న ఆర్ఎస్ 200 బైకుల ధరలు ప్రస్తున్న వాటి ధరలతో పోల్చుకుంటే రూ.1,000 నుండి రూ. 2000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. పల్సర్ ఆర్ఎస్200 నాన్ ఎబిఎస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 1.21 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.33 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

    బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    దేశీయ ఆధారిత టూ వీలర్ల తయారీ కంపెనీలు చాలా వరకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల కలర్ ఆప్షన్స్ మరియు విభిన్న గ్రాఫిక్ డిజైన్‌లను అందిస్తుంటాయి. కానీ సింగల్ పెయింట్ స్కీము బైకులు చూడటానికి ఎంతో చక్కగా ఉంటాయి. అందులో రేసింగ్ స్పోర్ట్ బైకులైతే ఈ హుందాయే వేరు.

    ఇలాంటి కలర్ ఆప్షన్స్‌ను కవాసకి, బెనెల్లీ వంటి కంపెనీలు ఎక్కువగా పరిచయం చేస్తాయి. అయితే, దీనిని గమనించిన బజాజ్ తమ ఏకైక బెస్ట్ ఇన్ క్లాస్ రేసింగ్ స్పోర్ట్ బైకు పల్సర్ ఆర్ఎస్200లో అందిస్తోంది.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar RS200 With New Colour Options Spotted At Dealership
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X