8 లక్షల వరకు డిస్కౌంట్లు: భారీ దీపావళి ఆఫర్లతో ముందుకొచ్చిన పది మోడళ్లు
భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో కార్ల కంపెనీలు ఈ దీపావళికి సిద్దమయ్యాయి. వీలైనన్ని కార్లను విక్రయించే ప్రణాళికల్లో కార్ల సంస్థ విభిన్న ఆఫర్లను ప్రకటించాయి. రూ. 50,000 ల నుండి రూ. 8 లక్షల వరకు తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ ఇటు కార్లు కొనేవారికి, అటు కార్లను విక్రయించే వారికి మంచి అవకాశాలను తీసుకొచ్చింది. పండుగ సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ కార్లను విక్రయించేందుకు దాదాపు అన్ని కార్ల కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో ముందుకొచ్చాయి.
ఈ దీపావళికి భారీ డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్‌లతో లభిస్తున్న పది ఎస్‌యూవీలను డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం అందిస్తోంది.

హ్యుందాయ్ టుసాన్
ఇండియా లైనప్‌లో హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ టుసాన్ ఎస్‌యూవీని ఈ మధ్యనే మార్కెట్లోకి లాంచ్ అయిన జీప్ కంపాస్ నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. దీపావళి సందర్భంగా హ్యుందాయ్ టుసాన్ మీద ఎంచుకోదగిన డీలర్ల వద్ద గరిష్టంగా రూ. 1 లక్ష రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది.

అంతే కాకుండా హ్యుందాయ్ డీలర్ల వద్ద ఉన్న 2016 లో తయారైన మోడళ్లను ఎంచుకునేవారు మరో లక్ష రుపాయల డిస్కౌంట్ అదనంగా పొందవచ్చు. గతంలో పాత టుసాన్ ఎస్‌యూవీలను కొనుగోలు చేసే వారికి లక్ష రుపాయల తగ్గింపు ఉంటుందని హ్యుందాయ్ ప్రకటించింది.
Recommended Video


మహీంద్రా ఎక్స్‌యూవీ500
ఇండియన్ డి-సెగ్మెంట్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. దీని మీద దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్ల వద్ద గరిష్టంగా రూ. 65,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. మహీంద్రా ఈ మధ్యనే డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ10 మధ్య గల స్థానాన్ని భర్తీ చేస్తూ డబ్ల్యూ9 మోడల్ ఎక్స్‌యూవీ500ను లాంచ్ చేసింది.

మహీంద్రా స్కార్పియో
ఇండియన్ ఎక్కువగా ఆదరిస్తున్న మహీంద్రా మోడళ్లలో స్కార్పియో ఒకటి. స్కార్పియో ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్ల మీద దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్ల వద్ద రూ. 50,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్
ఫోర్డ్ ప్రస్తుతం ఉన్న ఎకోస్పోర్ట్‌ను అతి త్వరలో పూర్తి స్థాయి అప్‌డేటడ్ వెర్షన్‌గా విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లభించే ఎకోస్పోర్ట్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 50,000 ల డిస్కౌంట్ మరియు ఈ పండుగ సీజన్‌లో కొనుగోలు చేసే వారికి పది వేల రుపాయల విలువైన బహుమతులు అందజేయనుంది.

రెనో డస్టర్
రెనో మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ డస్టర్ మీద దీపావళి సందర్భంగా ఉచిత ఇన్సూరెన్స్, యాక్ససరీలు మరియు క్యాష్ డిస్కౌంట్ కలుపుకొని రూ. 77,000 ల వరకు లాభాలను ప్రకటించింది. అయితే, రెనో ఈ మధ్య విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ శాండ్‌స్టార్ట్ మరియు పెట్రోల్ సివిటి వేరియంట్ల మీద ఈ ఆఫర్లు వర్తించవని పేర్కొంది.

నిస్సాన్ టెర్రానో
టెర్రానో డస్టర్ యొక్క రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్. రెనో భాగస్వామ్యపు సంస్థ నిస్సాన్ తమ టెర్రానో ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 87,000 ల వరకు లాభాలను ప్రకటించింది. వివిధ రకాల క్యాష్ డిస్కౌంట్లు, ఉచిత యాక్ససరీలతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిస్సాన్ డీలర్ల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు.

మహీంద్రా నువోస్పోర్ట్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియో తరువాత నువోస్పోర్ట్ ఎస్‌యూవీ మీద దీపావళిను ఆఫర్లను అందిస్తోంది. కేవలం 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే నువోస్పోర్ట్ మీద గరిష్టంగా రూ. 87,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

హోండా బిఆర్-వి
హోండా 7-సీటర్ ఎస్‌యూవీ స్టైల్లో ఉన్న ప్రవేశపెట్టిన బిఆర్-వి మీద గరిష్టంగా లక్ష రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ బిఆర్-వి లోని అన్ని వేరియంట్ల మీద వర్తిస్తుంది. అదే విధంగా హోండా బిఆర్-వి వెహికల్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లో ఎంచుకోగలరు.

ఆడి క్యూ3
ఈ పండుగ సీజన్‌లో కేవలం సరసమైన కంపెనీలు మాత్రమే కాదు లగ్జరీ కార్ల సంస్థలు కూడా తమ మోడళ్ల మీద డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ప్రకటించాయి. అందులో జర్మన్ దిగ్గజం ఆడి తమ పాపులర్ క్యూ3 ఎస్‌యూవీ మీద రూ. 50,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

వోల్వో ఎక్స్‌సి60
వోల్వో ఇండియా లైనప్‌లో ఎక్స్‌సి60 ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ. దేశవ్యాప్తంగా ఉన్న వోల్వో డీలర్లు ఈ ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. ఉచిత ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్స్ మరియు పొడగించబడిన వారంటీ మరియు ఉచిత ఇన్సూరెన్స్ వంటి లాభాలన్నింటిని 8 లక్షలతో అందిస్తోంది.


Click it and Unblock the Notifications








