డస్టర్ శాండ్‌స్టార్మ్ రిలీజ్ చేసిన రెనో: ధర, ఇంజన్, ఫీచర్లు...

Written By:

రెనో ఇండియా విపణిలోకి డస్టర్ ఎస్‌యూవీని శాండ్‌స్టార్మ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. రెగ్యులర్ మోడల్‌తో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉండే శాండ్‌స్టార్మ్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఆప్‌డేట్స్ ఎన్నో ఉన్నాయి.

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఆర్ఎక్స్ఎస్ డీజల్ 85పిఎస్ మరియు ఆర్ఎక్స్ఎస్ డీజల్ 110పిఎస్ వేరియంట్లు, ఈ రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ధర వివరాలు

  • డస్టర్ శాండ్‌స్టార్మ్ ఆర్ఎక్స్ఎస్ 85పిఎస్ ధర రూ. 10.90 లక్షలు
  • డస్టర్ శాండ్‌స్టార్మ్ ఆర్ఎక్స్ఎస్ 110పిఎస్ ధర రూ. 11.70 లక్షలు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్‌లో ముందువైపున డస్టర్ బ్రాండ్ పేరు మరియు లైట్ల జోడింపుతో బంపర్ తరహాలో సరికొత్త బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు. స్పెషల్ ఎడిషన్ డస్టర్‌లోని ఫ్రంట్ బానెట్, డోర్లు, టెయిల్ గేట్ మరియు ఓఆర్‌విఎమ్స్ మీద శాండ్‌స్టార్మ్ డీకాల్స్ ఉన్నాయి. వీటితో బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ మరియు 16-అంగుళాల సరికొత్త జోడియాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేకం.

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో శాండ్‌స్టార్మ్ బ్రాండ్ పేరు గల సీట్ కవర్లు మరియు ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న అప్‌హోల్‌స్ట్రే(కారు లోపలి పై భాగం) కలదు.

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మరియు రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎస్‌యూవీని అవుట్‌బ్యాక్ బ్రాంజ్, మూన్‌లైట్ సిల్వర్ మరియు స్లేట్ గ్రే వంటి కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

సాంకేతికంగా రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్ ఎస్‌యూవీలో కె9కె 1.5 లీటర్ డీజల్ ఇంజన్ కలదు, ఇది రెండు రకాల పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అందులో ఒక యూనిట్ 108బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా మరో యూనిట్ 84బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెనో డస్టర్ శాండ్‌స్టార్మ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెగ్యులర్ డస్టర్‌తో పోల్చితే, శాండ్‌స్టార్మ్ ఎడిషన్ అత్యంత స్టైలిష్‌గా ఉంది. ధర కూడా సాధారణ డస్టర్ కంటే రూ. 30,000 లు మాత్రమే అధికం. రెనో ఇండియా డస్టర్‌లో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరిన్ని ఫీచర్లను అందించింది.

English summary
Read In Telugu: Renault sandstorm launched in india launch pricespecifications images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark