విపణిలోకి బెనెల్లీ 302ఆర్ విడుదల: ధర రూ. 3.48 లక్షలు

బెనెల్లీ దేశీయ విపణిలోకి 302 ఆర్ బైకును విడుదల చేసింది. సరికొత్త డిఎస్‌కె బెనెల్లీ 302 ఆర్ ప్రారంభ ధర రూ. 3.48 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

By Anil

బెనెల్లీ దేశీయ విపణిలోకి 302 ఆర్ బైకును విడుదల చేసింది. సరికొత్త డిఎస్‌కె బెనెల్లీ 302 ఆర్ ప్రారంభ ధర రూ. 3.48 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఈ ఎంట్రీ లెవల్ బైకును తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఆవిష్కరించింది.

బెనెల్లీ 302ఆర్ విడుదల

సాంకేతికంగా బెనెల్లీ 302ఆర్ మోటార్ సైకిల్‌లో 300సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 11,500ఆర్‌పిఎమ్ వద్ద 8.26బిహెచ్‌పి పవర్ మరియు 10,000ఆర్‌పిఎమ్ వద్ద 26.5ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video

Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బెనెల్లీ 302ఆర్ విడుదల

బెనెల్లీ తమ టిఎన్‌టి 300 మోటార్ సైకిల్‌లో వినియోగించిన తేలికపాటి బరువున్న ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను 302ఆర్ బైకులో అందించింది. ఉత్తమ సస్పెన్షన్ వ్యవస్థ కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. అంతే కాకుండా డ్యూయల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అందించారు.

బెనెల్లీ 302ఆర్ విడుదల

బ్రేకింగ్ విధుల కోసం, ముందు వైపున 4-కాలిపర్ పిస్టన్స్ గల 260ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న రెండు డిస్క్ బ్రేకులు అదే విధంగా వెనుక వైపున సింగల్ పిస్టన్ కాలిపర్ 240ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. అధిక వేగం వద్ద షడన్ బ్రేకులు వేస్తే వీల్స్ లాక్ కాకుండా చేసే యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందించింది.

బెనెల్లీ 302ఆర్ విడుదల

డిజైన్ పరంగా బెనెల్లీ 302ఆర్ రెండు లైట్లు గల హెడ్ ల్యాంప్ క్లస్టర్, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం రీడిజైన్ మరియు రీ పొజిషన చేయబడిన ఫుట్ పెడల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ఎల్ఇడి టెయిల్ లైట్స్, క్లియర్ లెన్స్ ఇండికేటర్లు, డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. కొనుగోలుదారులు 302ఆర్ మోటార్ సైకిల్‌ను వైట్ రోస్సో, రెడ్ నిరో మరియు సిల్వర్ వెర్ది కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

బెనెల్లీ 302ఆర్ విడుదల

డిఎస్‌కె బెనెల్లీ తమ 302ఆర్ మోటార్ సైకిల్ మీద నాలుగు సంవత్సరాలు లేదా అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వరకు వారంటీ కల్పించింది. ప్రస్తుతం విపణిలో ఉన్న కవాసకి నింజా 300, కెటిఎమ్ ఆర్‌సి 390 మరియు యమహా వైజడ్ఎఫ్-ఆర్3 లతో పోటీపడనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Benelli 302R Launched In India: Priced At Rs 3.48 Lakh
Story first published: Tuesday, July 25, 2017, 14:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X