డ్యూక్ 200 కు పోటీగా బెనెల్లీ టిఎన్‌టి 200 రివీల్

Written By:

ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ ఇటీవల ఇటలీలో జరిగిన మిలాన్ 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద సరికొత్త బెనెల్లీ టిఎన్‌టి200 నేక్డ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

బెనెల్లీ టిఎన్‌టి 200

ఇదే నేక్డ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ బెనెల్లీ టిఎన్‌టి200కు గట్టి పోటీనివ్వనుంది. సరికొత్త బెనెల్లీ 200 బైకు గురించిన పూర్తి వివరాలు మరియు కెటిఎమ్ డ్యూక్‌ 200తో పోల్చుకుంటే ఎంత వరకు బెటరో... ఇవాళ్టి స్టోరీలో...

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
బెనెల్లీ టిఎన్‌టి 200

2017 EICMA మోటార్ సైకిల్‌లో షో వేదిక మీద ఆవిష్కరించిన బెనెల్లీ టిఎన్‌టి200లో 199.4సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‍‌బాక్స్ గల ఇది 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 21.5బిహెచ్‌పి పవర్ మరియు 18ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ టిఎన్‌టి 200

టెక్నికల్ మరియు ఫీచర్ల గురించిన వివరాలు వెల్లడించడానికి బెనెల్లీ నిరాకరించింది. అయితే, ఇందులో ముందు వైపున 120ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ మరియు వెనుక వైపున 45ఎమ్ఎమ్ ట్రావెల్ గల ప్రిలోడెడ్ మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

బెనెల్లీ టిఎన్‌టి 200

బెనెల్లీ లైనప్‌లో ఉండే ఇతర మోడళ్ల తరహాలో ఉన్న ట్రెస్టిల్ ఫ్రేమ్(ఎరుపు రంగు పెయింట్ చేయబడిన)కలదు. బెనెల్లీ టిఎన్‌టి 200 పొడవు 2,050ఎమ్ఎమ్, వెడల్పు 810ఎమ్ఎమ్, ఎత్తు 1,065ఎమ్ఎమ్ కలదు. 13-లీటర్ల ఫ్యూయల్ కెపాసిటి గల బైకు బరువు 164కిలోలుగా ఉంది.

బెనెల్లీ టిఎన్‌టి 200

బెనెల్లీ టిఎన్‌టి 200 నేక్డ్ స్పోర్ట్స్ బైకులో ముందు వైపున నాలుగు కాలిపర్లు గల 260ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డబుల్ కాలిపర్ పిస్టన్ గల 240ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేకు కలదు. అయితే, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో రాలేదు.

బెనెల్లీ టిఎన్‌టి 200

ఎంట్రీ లెవల్ నేక్డ్ స్పోర్ట్స్ బైకులో ఇరువైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. అయితే, ఫ్రంట్ టైర్ 110/80 మరియు రియర్ టైర్ 130/70 కొలతల్లో ఉన్నాయి. డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్ల్పిట్ సీటును ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.

బెనెల్లీ టిఎన్‌టి 200

దేశీయంగా 200-250సీసీ సెగ్మెంట్లో కెటిఎమ్‌ డ్యూక్ 200 మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైకులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, ఈ సెగ్మెంట్లోకి బెనెల్లీ ఆవిష్కరించిన టిఎన్‌టి200 మోడల్ ఆ రెండింటిపై ఉన్న పాపులారిటీని బ్రేక్ చేసే అవకాశం ఉంది.

బెనెల్లీ టిఎన్‌టి 200

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ డ్యూక్ 200 బైకులో 25బిహెచ్‌పి పవర్ మరియు 19.20ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 199.5సీసీ కెపాసిటి గల సింగల్ సిలండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. పవర్ మరియు టార్క్ విషయంలో కెటిఎమ్ డ్యూక్ 200 బెటర్ అని చెప్పవచ్చు. అయితే, ఇటాలియన్ స్టైల్ ఇంజనీరింగ్, డిజైన్, క్వాలిటీ మరియు ఫీచర్ల విషయంలో ఆస్ట్రియన్ దిగ్గజానికి నిరాశ తప్పనిపిస్తోంది.

బెనెల్లీ టిఎన్‍‌టి 200 మరియు కెటిఎమ్ డ్యూక్ 200 నేక్డ్ స్పోర్ట్స్ బైకుల్లో మీకు ఏది నచ్చింది. క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

English summary
Read In Telugu: Benelli TNT 200 Revealed To Rival KTM Duke 200
Story first published: Friday, November 17, 2017, 13:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark