ఏబిఎస్‌ వెర్షన్‌లో డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి300

Written By:

డిఎస్‍‌కె బెనెల్లీ తమ టిఎన్‌టి300 బైకును ఇప్పుడు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబిఎస్) వెర్షన్‌లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనికి ముందు బెనెల్లీ మార్కెట్లోకి 302ఆర్ అనే ఫుల్లీ ఫెయిర్డ్ బైకును ఏబిఎస్‌తో విడుదల చేసింది.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

బెనెల్లీ ఇండియా లైనప్‌లో టఎన్‌టి 600ఐ మరియు 302ఆర్ బైకుల తరువాత టిఐన్‌టి 300 ఏబిఎస్‌ ఫీచర్‌తో వరుసగా విడుదలైన మూడవ బైకుగా నిలిచింది. బెనెల్లీ టిఐన్‌టి 300 గ్రీన్, వైట్, రెడ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభించును.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

దేశవ్యాప్తంగా పలు డీలర్‌షిప్‌లు బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్ వెర్షన్ మీద బుకింగ్స్ ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ మోటార్ సైకిల్‌ను రూ. 25,000 ల ధరతో బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మరియ దీని ప్రారంభ ధర రూ. 3.29 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

Recommended Video - Watch Now!
Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

సాంకేతికంగా బెనెల్లీ టిఎన్‌టి 300 బైకులో 300సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌ కూల్డ్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 37బిహెచ్‌పి పవర్ మరియు 26.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. 302ఆర్ బైకులో కూడా ఇదే ఇంజన్ కలదు.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

300సీసీ నేక్ట్డ్ మోటార్ సైకిల్‌లో ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. బ్రేకింక్ డ్యూటీ కోసం ముందు చక్రానికి రెండు డిస్క్‌లు మరియు వెనుక చక్రానికి సింగిల్ డిస్క్ బ్రేక్ కలదు.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

మొత్తం 196కిలోలు బరువున్న బెనెల్లీ టిఎన్‌టి 300 బైకులో 16-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ కలదు. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్(ఇంజన్ క్రిందున్న టెయిల్ పైపు) సిస్టమ్‌ కలదు, బాడీ వెయిట్ బ్యాలెన్సింగ్ ద్వారా అత్యుత్తమ హ్యాండ్లింగ్ సాధ్యమయ్యింది.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

డిఎస్‌కె బెనెల్లీ ఈ ఏడాది నవంబరులో లియోన్సినో స్క్రాంబ్రల్ అనే మరో బైకును విడుదలకు సిద్దం చేస్తోంది. తరువాత వచ్చే ఏడాదిలో టిఆర్‌కె 502 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేయనుంది.

బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డెఎస్‌కె బెనెల్లీ మొత్తానికి తమ నేక్ట్డ్ వెర్షన్ బైకులో ఎట్టకేలకు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. బెనెల్లీ టిఎన్‌టి 300 ఏబిఎస్ విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390, మహీంద్రా మోజో మరియు కవాసకి జడ్250 లకు గట్టిపోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Benelli TNT 300 ABS Now Available In India
Story first published: Monday, September 18, 2017, 10:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark