బిఎస్3 డ్యూక్ 390 లను 1.5 లక్షలకే అందుబాటులో ఉంచిన కెటిఎమ్ డీలర్లు

Written By:

ఇండియాలో అత్యుత్తమ స్ట్రీట్ బైకు ఏదంటే ఎలాంటి అనుమానం లేకుండా కెటిఎమ్ డ్యూక్ 390 అని చెప్పవచ్చు. అయితే పాత వెర్షన్ డ్యూక్ 390 స్థానంలోకి ఈ మధ్యన 2017 కెటిఎమ్ డ్యూక్ 390 ను ప్రవేశపెట్టడం జరిగింది. రెండింటి మద్య బిఎస్4 ఇంజన్ మినహాయిస్తే మరే తేడా లేదు.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

బిఎస్-3 టూ వీలర్లను విక్రయించుకోవడానికి ప్రభుత్వం మార్చి 31, 2017 ను గడువుగా ప్రకటించడంతో, గడువు ముగిసే నాటికి అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 టూ వీలర్ల స్టాక్ డీలర్ల వద్ద భారీగా ఉన్నట్లు తెలిసింది.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

అయితే డీలర్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఆ అమ్ముడుపోకుండా నిలిచిపోయిన టూ వీలర్లయిన డ్యూక్ 390 లను తమ పేర్ల మీదే కొనుగోలు చేశారు. అయితే తరువాత వాటిని కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను కొనుగోలు చేయడానికి వచ్చే వారికి విక్రయించే ప్రయత్నం చేశారు.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

సెకండ్ హ్యాండ్ ఓనర్‍‌గా ఆ బైకులను కొనుగోలు చేసినప్పటికీ అవి 0 కిమీల రీడింగ్ మరియు ఒక ఏడాది పాటు ఉచిత ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఒక్క బిఎస్-3 మరియు బిఎస్-4 ఇంజన్ మినహాయిస్తే దాదాపు రెండు బైకులు(పాత డ్యూక్ 390 మరియు 2017 డ్యూక్ 390) ఒకే విధంగా ఉంటాయి.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

నిజానికి బిఎస్-3 కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్ సైకిల్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని 1.5 లక్షల ఆన్ రోడ్ ధరకే విక్రయిస్తుండటం ఆశ్చర్యకరం. మహారాష్ట్రలోని బోయిసర్ ప్రాంతంలో ఉన్న కెటిఎమ్ డీలర్‌షిప్ ఈ బైకులను దాదాపు లక్షల రుపాయల తక్కువ ధరకే విక్రయిస్తోంది.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

కెటిఎమ్ డ్యూక్ 390లో అదే 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ సిలిండర్‌తో సరికొత్త బిఎస్ 4 వేరియంట్ 2017 డ్యూక్ 390లో వచ్చింది. పనితీరు పరంగా రెండు ఒకే విదమైన ప్రదర్శనను కనబరుస్తాయి.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

సాంకేతికంగా కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్ సైకిల్ లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బిఎస్3 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను విక్రయిస్తున్న డీలర్లు

కెటిఎమ్ డ్యూక్ 390లో స్లిప్పర్ క్లచ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వైపున ఇన్వర్టెడ్ ప్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ మరియు ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు కలవు.

English summary
Read In Telugu BS3 Ktm 390 Duke Rs 1.5 Lakh On Road
Story first published: Wednesday, May 17, 2017, 12:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark