కోటి పన్నెండు లక్షల రుపాయల ధరతో విడుదలైన డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

Written By:

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటి ఇండియన్ మార్కెట్లోకి పనిగాలా 1299 సూపర్ లెగ్గెరా ను విడుదల చేసింది. అయితే సామాన్యులు దీనిని అస్సలు కొనలేరు. ఎందుకంటే విడుదల చేసిన భారత దేశపు అత్యంత ఖరీదైన ఈ బైకు ధరను రూ. 1.12 కోట్లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఖరారు చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

సూపర్‌లెగ్గెరా అనగా ఇటాలియన్ భాషలో సూపర్ లైట్ అని అర్థం. ప్రత్యేకించి సూపర్ లైట్ మోటార్ సైకిళ్లను ఎంచుకునే వారి కోసం అభివృద్ది చేసిన పనిగాలా 1299 సూపర్ లెగ్గెరా బైకును మిలాన్‌లో జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

డుకాటి పనిగాలా శ్రేణిలో ఉత్పత్తి చేసిన అతి తక్కువ బరువున్న మోటార్ సైకిల్ ఈ 1299 సూపర్‌లెగ్గెరా. పూర్తి స్థాయిలో నిర్మాణానంతరం దీని మొత్తం బరువు కేవలం 167 కిలోలుగా ఉంది.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అరుదైన మోటార్ సైకిల్‌గా దీనిని నిలపడానికి అతి తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నట్లు డుకాటి దీని విడుదల వేదిక మీద తెలిపింది. ఇటలీలోని తమ ప్రొడక్షన్ ప్లాంటులో కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

సాంకేతికంగా డుకాటి పనిగాలా 1299 సూపర్‌లెగ్గెరా స్పోర్ట్స్ బైకులో 1285సీసీ సామర్థ్యం గల సూపర్ క్వాడ్రో ఇంజన్ కలదు. ఇది 11,000 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 215బిహెచ్‌పి పవర్ మరియు 9,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 147ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

కేవలం 167 కిలోల బరువుతో నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్, స్వింగ్ ఆర్మ్ మరియు చక్రాలను కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారు చేయడం జరిగింది.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

ఇప్పుడు డుకాటి 1299 సూపర్‌లెగ్గెరా గురించి మరొక ఆసక్తికరమైన విషయం దీని రూపకల్పన. దీనిని మోటోజిపి ఎలక్ట్రానిక్స్ చేత అభివృద్ది చేయబడింది. ఇందులో ప్రధానమైనది డుకాటి పవర్ లాంచ్ (DLP). ఇందులో మూడు లెవల్స్‌లో అడ్జెస్ట్‌మెంట్ చేసుకునే వీలున్న డుకాటి వీలి కంట్రోల్ (DWC) మరియు డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC) కలవు.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

1299 సూపర్‌లెగ్గెరా స్పోర్ట్స్ బైకులో మల్టీ అడ్జెస్టబుల్ 43ఎమ్ఎమ్ ఓహ్లిన్స్ ఎఫ్ఎల్936 అప్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మల్టీ అడ్జెస్టబుల్ ఓహ్లిన్స్ టిటిఎక్స్36 మోనోషాక్ అబ్జార్వర్ కలదు. డుకాటి సంస్థ తమ మోటార్ సైకిళ్లలో అందించిన ఓహ్లిన్స్ వారి అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ ఇదే.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

ముందు వైపున బ్రెంబో ఎమ్50 కాలిపర్స్ గల రెండు 330ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున రెండు పిస్టన్ల బ్రెంబో కాలిపర్ గల 245ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు.

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

రేసింగ్ ప్రియుల కోసం డుకాటి ఈ పనిగాలా 1299 సూపర్‌లెగ్గెరా బైకులో రేసింగ్ కిట్‌ను అందిస్తోంది. ఈ కిట్‌లో రేసింగ్ ఎగ్జాస్ట్, రేసింగ్ స్టాండ్స్, నెంబర్ ప్లేట్ తొలగించే కిట్, బైక్ కవర్, రేసింగ్ విండ్ స్క్రీన్, సైడ్ స్టాండ్ తొలగించే కిట్ మరియు ముందు వైపున్నఅద్దాన్ని మార్చుకునే సదుపాయాలను అందిస్తోంది.

English summary
Ducati 1299 Superleggera Launched In India At Rs 1.12 Crore; Features Explained
Story first published: Thursday, January 19, 2017, 18:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark