కేవలం రూ. 19,990 లకే స్కూటర్ విడుదల చేసిన హీరో ఎలక్ట్రిక్

Written By:

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకుల తయారీ రంగంలో ముందంజలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ దేశీయంగా చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఈ స్కూటర్ పేరు ఫ్లాష్ అని తెలుపుతూ దీని ప్రారంభ ధర రూ. 19,990 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిదారు హీరో ఎలక్ట్రిక్ మాట్లాడుతూ, 65 కిలోమీటర్లు పాటు ఏకదాటిగా ప్రయాణించే ఈ స్కూటర్‌ను ఒక్కసారిగా 6 నుండి 8 గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

ఇందులో 48వోల్ట్స్/20ఏహెచ్ విఆర్ఎల్ఎ బ్యాటరీ అనుసంధానం గల 250వాట్ సామర్థ్యం గల మోటార్ కలదు.ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

స్కూటర్‌కు ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది, మరియు మొత్తం స్కూటర్ బరువు 87 కిలోలుగా ఉంది. రెండు చక్రాలకు కూడా డ్రమ్ బ్రేక్‌లను అందించారు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

తయారీదారుడు ఈ స్కూటర్‌కు రెండేళ్ల పాటు వారంటీని కల్పిస్తోంది. భద్రత కోసం రైడింగ్‌లో ఉన్న ప్రమాదం జరిగితే షార్ట్ సర్క్యూట్ నివారణ ఫీచర్‌ను ఇందులో పరిచయం చేయడం జరిగింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

ఈ సరికొత్త ఎలకొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజితో లభిస్తోంది. వినియోగదారులు దీనిని బర్గుండీ మరియు సిల్వర్ అనే రెండు రంగుల్లో ఎంపిక చేసుకోవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాష్

గ్లోబర్ హీరో ఎకో సిఇఒ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, ప్లాష్ విడుదలతో ఇండియాకు ఎలక్ట్రిక్ రవాణా పద్దతిని అనుసంధానం చేయడంలో ముందుకు సాగుతున్నామని తెలిపాడు. తక్కువ ధర మరియు ఆధునిక టెక్నాలజీతో మరిన్ని ఉత్పత్తులను భవిష్యత్తులో విడుదల చేస్తామని సోహిందర్ అన్నారు.

English summary
Hero Electric Launches ‘Flash’ In India; Priced At Rs 19,990
Please Wait while comments are loading...

Latest Photos