బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

బాలికల విద్యా ఉన్నతి కోసం "వీల్స్ ఆఫ్ చేంజ్" చొరవతో ఇండియన్ మోటార్ సైకిల్ కన్యాకుమారి - కాశ్మీర్(కె2కె) రైడ్‌ను బెంగళూరు జెండా ఊపి ప్రారంభించింది.

By Anil

బాలికల విద్యా ఉన్నతి కోసం "వీల్స్ ఆఫ్ చేంజ్" చొరవతో ఇండియన్ మోటార్ సైకిల్ కన్యాకుమారి - కాశ్మీర్(కె2కె) రైడ్‌ను బెంగళూరు జెండా ఊపి ప్రారంభించింది.

ముగ్గురు ఇండియన్ రోడ్ మాస్టర్ ఓనర్లు 12 నగరాల మీదుగా ప్రయాణించి ఆరు స్కూళ్లు సందర్శించనున్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ మరియు బాలికల విద్యకు నిధులను సేకరించనున్నారు. కె2కె రైడ్‌లో అనురాగ్ శ్రీవాస్తవ, నిలాద్రి సాహా మరియు బెర్నార్డ్ లాజర్ పాల్గొంటున్నారు.

బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

బాలికలకు ప్రాథమిక మరియు హై స్కూల్ విద్యనందించేందుకు రైడింగ్ అంటే విపరీతమైన మక్కువ ఉన్న ముగ్గురు ఇండియన్ మోటార్ సైకిల్ కస్టమర్ల నుండి ఈ కన్యాకుమారి - కాశ్మీర్ (కె2కె) రైడ్ ప్రాణం పోసుకుంది.

Recommended Video

Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

అంతే కాకుండా బెంగళూరులోని కోడి హళ్లి ప్రాంతంలో ఉన్న విద్యారణ్యలో గల "రెయిన్ బో హో" వీల్స్ ఆఫ్ చేంజ్ అనే ఫౌండేషన్ వారు ఇండియన్ మోటార్ సైకిల్ కె2కె రైడ్ కోసం ముందుకొచ్చారు.

బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

ఈ ఫౌండేషన్ సుమారుగా 76 మంది ఆడ పిల్లను చేరదీసి, పునరావాసం కల్పించి విద్య, ఆహారం, ఆవాసం, మరియు దుస్తులను ఉచితంగా అందిస్తోంది. ఇలాంటి బాలికల విద్య కోసం ఇండియన్ మోటార్ సైకిల్ ప్రారంభించిన కె2కె రైడ్ బెంగళూరు నుండి తమిళనాడు చేరుకొని, తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగనుంది.

బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

కె2కె రైడ్‌లో భాగంగా ముగ్గురు రైడర్లు దేశవ్యాప్తంగా ఉన్న 12 ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, కన్యాకుమారి, కోల్హాపూర్, ముంబాయ్, అహ్మదాబాద్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, ఢిల్లీ, జలందర్, అమృత్‌సర్, మరియు రణబీర్ సింగ్ పుర మీదుగాకాశ్మీరుని చేరుకోనున్నారు.

బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

పొలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా హెడ్ మరియు మేనేజింగ్ డైరక్టర్ పంకజ్ దుబే మాట్లాడుతూ,"నీలాద్రి సాహా, అనురాగ్ శ్రీవాస్తవ మరియు బెర్నార్డ్ లజార్ ముగ్గురు రైడర్లు కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి, బాలికల విద్య గురించి చైతన్యం తీసుకొచ్చేందుకు కె2కె రైడ్‌ ద్వారా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు."

బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వీల్స్ ఆఫ్ చేంజ్ చొరవతో దేశవ్యాప్తంగా ఆడ పిల్లల విద్యాభివృద్ది కోసం ఇండియన్ మోటార్ సైకిల్స్ పాటుబడుతోంది. కె2కె రైడ్‌లో పొల్గొన్న ముగ్గురు రైడర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రదాన నగరాలను చేరుకుని చిన్న ఆడ పిల్లల విద్య కోసం నిధులను సేకరించనున్నారు మరియు బాలికలకు ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు.

Most Read Articles

English summary
Read In Telugu: Indian Motorcycle Flags Off Kashmir To Kanyakumari (K2K) Fundraiser Ride
Story first published: Monday, September 11, 2017, 14:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X