విపణిలోకి ఇండియన్ స్కౌట్ బాబర్ విడుదల: ధర రూ. 12.99 లక్షలు

Written By:

ఇండియన్ మోటార్ సైకిల్స్ విపణిలోకి సరికొత్త ఇండియన్ స్కౌట్ బాబర్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఇండియన్ స్కౌట్ బాబర్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ స్కౌట్ బాబర్

గోవాలో జరిగిన ఐదవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఈవెంట్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ స్కౌట్ బాబర్‌ను విడుదల చేసింది. స్కౌట్ బాబర్ మీద రూ. 50,000 లతో బుకింగ్స్ ప్రారంభించారు.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ స్కౌట్ బైకు యొక్క మరో వెర్షన్. స్కౌట్ బాబర్ బైకులో స్కౌట్ బైకు నుండి సేకరించిన 1,133సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 100బిహెచ్‌పి పవర్ మరియు 97.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ పొడవు 2,276ఎమ్ఎమ్, వెడల్పు 926ఎమ్ఎమ్, ఎత్తు 1,154ఎమ్ఎమ్, వీల్ బేస్ 1,562ఎమ్ఎమ్ మరియు ఈ క్రూయిజర్ బైకు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 123ఎమ్ఎమ్‍‌గా ఉంది.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ బైకులో సింగల్ సీటు కలదు, దీని ఎత్తు 649ఎమ్ఎమ్ ఉంది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఫ్యూయల్ ట్యాంకులో స్టోరేజ్ కెపాసిటి 12.5-లీటర్లుగా ఉంది. ట్యాంక్ నిండా ఫ్యూయల్ నింపితే ఇండియన్ స్కౌట్ బాబర్ బరువు 251కిలోలుగా ఉంది.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ క్రూయిజర్ బైకులో ముందు వైపున క్యాడ్రిడ్జ్ టైప్ 120ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున 50ఎమ్ఎమ్ డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

ఇండియన్ స్కౌట్ బాబర్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు మరియు వెనుక వైపున ఉన్న 16-అంగుళాల పరిమాణం ఉన్న చక్రాలకు 298ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వీటిలో ముందువైపున K761 130/90-16 73H (ముందు) మరియు 150/80-16 71H (వెనుక) కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ నలుపు రంగులో ముంచి తీసినట్లుగా ఉంటుంది. దీని ఎక్ట్సీరియర్ మీద అక్కడక్కడ క్రోమ్ తొడుగులు ఉన్నాయి. హెడ్ ల్యాంప్ పట్టీ, వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రేమ్, కూలింగ్ సిస్టమ్, ఎగ్జాస్ట్, క్లచ్ కవర్, హ్యాండిల్ బార్స్, మిర్రర్లు మరియు ఇంస్ట్రుమెంటేషన్ వంటివి కంప్లీట్ బ్లాక్‌ కలర్‌లో ఉన్నాయి.

ఇండియన్ స్కౌట్ బాబర్

స్కౌట్ క్రూయిజర్ ఐదు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, ఇండియన్ మోటార్ సైకిల్ రెడ్, థండర్ బ్లాక్, థండర్ బ్లాక్ స్మోక్, స్టార్ సిల్వర్ స్మోక్ మరియు బ్రాంజ్ స్మోక్.

ఇండియన్ స్కౌట్ బాబర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కౌట్ బాబర్ అగ్రెసివ్ డిజైన్‌ను పోలి ఉంది. స్ట్రిప్డ్ డౌన్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను కోరుకునేవారికి ఇండియన్ బ్రాండ్ పేరుతో అమెరికా దిగ్గజం తయారు చేస్తున్న స్కౌట్ బాబర్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Indian Scout Bobber Launched In India For Rs 12.99 Lakh At IBW 2017
Story first published: Saturday, November 25, 2017, 15:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark