ఇండియన్ మోటార్ సైకిల్ నుండి స్కౌట్ బాబర్ మరియు స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్ బైకులు

Written By:

ఇండియన్ మోటార్ సైకిల్ దేశీయ ఖరీదైన బైకుల విపణిలోకి మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. స్కౌట్ బాబర్ మరియు స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్ బైకులను విడుదల చేయడానికి ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ సిద్దంగా ఉంది.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్లో ఈ రెండు మోడళ్లను చేర్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, స్కౌట్ బాబర్ మరియు స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్ బైకులను అక్టోబర్ 2017లో విడుదల చేసి, నవంబర్ నుండి డెలివరీలను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

స్కౌట్ బాబర్ బైకు మీద బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ మోటార్ సైకిల్స్ ఇది వరకే ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ. 50,000 లను చెల్లించి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మోటార్ సైకిల్ డీలర్ల వద్ద ఈ బైకును బుక్ చేసుకోవచ్చు.

Recommended Video - Watch Now!
Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
ఇండియన్ మోటార్‌ సైకిల్స్

సరికొత్త స్కౌట్ బాబర్ బైకును తొలుత జూలై 2017లో ఆవిష్కరించారు. మరియు రెగ్యులర్ స్కౌట్ యొక్క స్ట్రిప్డ్ డౌన్ ఇటరేషన్‌గా స్కౌట్ బాబర్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఇందులో స్ట్రీట్ ట్రాకర్ హ్యాండిల్ బార్, హ్యాండిల్ బార్ చివర్లో రియర్ వ్యూవ్ మిర్రర్స్, మరియు సరికొత్త ఇండియన్ బ్యాడ్జింగ్‌ ఉన్నాయి.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

సాంకేతికంగా స్కౌట్ బాబర్ క్రూయిజర్ బైకులో 1,131సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 98.67బిహెచ్‌పి పవర్ మరియు 97.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ ఈ స్కౌట్ బాబర్ బైకు ధరను రూ. 13.21 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించే అవకాశం ఉంది. మరియు విపణిలో ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ ఫార్టీ ఎయిట్, ట్రయంప్ బొన్‌విల్ బాబర్ మరియు మోటో గుజ్జి వి9 బాబర్‌ లకు గట్టి పోటీనివ్వనుంది.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

ఇండియన్ స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్ విషయానికి వస్తే, భారీ బ్యాగులున్న పెద్ద క్రూయిజర్ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. అగ్రెసివ్ లుక్ కోసం డార్క్ హార్స్ ఎడిషన్ బైకు మ్యాట్ బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంది. ఇండియన్ దీనిని ఛీప్ (చీఫ్ టెయిన్, చీఫ్ వింటేజ్)ఫ్లాట్ ఫామ్ మీద నిర్మించినప్పటికి డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా మార్పులు జరిగాయి.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్ బైకులో 1,811సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సేఫ్టీ పరంగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, కీలెస్ ఇగ్నిషన్, వెంటనే తొలగించే వీలున్న విండ్ షీల్డ్, రిమోట్ లాకింగ్ హార్డ్ శాడిల్ బ్యాగులు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ మోటార్‌ సైకిల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మోటార్ సైకిల్స్ స్కౌట్ మోడల్‌కు బాబల్ లక్షణాలను అందించి స్కౌట్ బాబర్‌గా అభివృద్ది చేసింది. స్కౌట్ బాబర్ మరియు స్ప్రింగ్‌ఫీల్డ్ డార్క్ హార్స్‌లతో పాటు చీఫ్‌టెయిన్ మోడల్‌ను క్లాసిక్ మరియు లిమిటెడ్ ఎడిషన్‌లో అదే విధంగా, రోడ్‌మాస్టర్‌ను క్లాసిక్ మరియు ఎలైట్ వెర్షన్‌లో విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: Indian Scout Bobber And Springfield Dark Horse Launch Details Revealed
Story first published: Tuesday, September 19, 2017, 13:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark