Subscribe to DriveSpark

రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీగా వస్తున్న మహీంద్రా జావా 350 మోటార్ సైకిల్

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు ఇప్పటి వరకు సరైన పోటీ లేదు. దీంతో దేశీయ విపణిలోని రెట్రో మోటార్ సైకిళ్ల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ 95 శాతం వాటాను సొంతం చేసుకుంది. అయితే, మరో దేశీయ దిగ్గజం మహీంద్రా ఇప్పుడు జావా బ్రాండ్ పేరుతో ఖచ్చితమైన పోటీనిచ్చే బైకులను అభివృద్ది చేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మహీంద్రా జావా 350

మహీంద్రా సరికొత్త జావా 350 బైకును ఆవిష్కరించింది. మొత్తానికి ఈ బైకుతో రాయల్ ఎన్ఫీల్డ్ మరియు మహీంద్రా మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని సంస్థగా నిలిచిన రాయల్ ఎన్ఫీల్డ్‌‌తో తలపడటానికి సిద్దమైన జావా బ్రాండ్ మరియు 350సీసీ మోటార్ సైకిల్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video
[Telugu] Suzuki Intruder 150 Launched In India
మహీంద్రా జావా 350

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జావా బ్రాండ్ 1950లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి 1960 లో మైసూరు కేంద్రంగా ఐడియల్ జావా ఇండియా లిమిటెడ్ పేరుతో క్లాసిక్ మరియు రెట్రో స్టైల్ బైకులను ఉత్పత్తి చేసేది. అయితే, 1996 లో ఆశించిన ఆదరణ లభించకపోవడంతో మార్కెట్ నుండి వైదొలగింది.

మహీంద్రా జావా 350

అప్పట్లో సరైన కస్టమర్ల లేకపోవడంతో జావా బ్రాండ్ భారత్‌కు స్వస్తి పిలికింది. అయితే, ఇప్పుడు జావా బ్రాండ్ మోటార్ సైకిళ్లకు ఖచ్చితమైన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే, జావా బ్రాండ్ మళ్లీ ఇండియాకొస్తే, మరో సంచళనం ఖాయం. ఇదీ భారత్‌లో జావా బ్రాండ్‌కు ఉన్న పేరు.

మహీంద్రా జావా 350

నిజమే, ఎప్పటికప్పుడు వ్యాపార అవకాశాలను అంచనా వేస్తూ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా దీనిని పసిగట్టింది. వెంటనే, చెక్ రిపబ్లిక్ సంస్థ జావా కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసింది. బ్రాండ్ పేరు, తయారీ మరియు పరిజ్ఞానాన్ని మహీంద్రా సొంతం చేసుకుంది.

మహీంద్రా జావా 350

ఐడియల్ జావా ఇండియా లిమిటెడ్ హక్కులను పూర్తిగా సొంతం చేసుకున్న మహీంద్రా వారి పరిజ్ఞానాన్ని కూడా భద్రత పరుచుకుంది. ఇక తాజాగా రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్లను మహీంద్రా గ్రూప్ జావా బ్రాండ్ పేరుతో కొన్నింటిని ఆవిష్కరించింది.

మహీంద్రా జావా 350

జావా మోటార్ సైకిళ్లు ఇండియన్ మార్కెట్లో వైదొలగడానికి మరో కారణం జావా 2-స్ట్రోక్ ఇంజన్ బైకులను ఉత్పత్తి చేసేది. ఇవి పర్యావరణానికి ఎంతో హానికరం. అందుకే దీనికి పరిష్కారంగా 350సీసీ ఇంజన్ కెపాసిటితో ఓవర్ హెడ్ క్యామ్(OHC)4-స్ట్రోక్ ఇంజన్‌ను జావా బ్రాండ్ అభివృద్ది చేసింది.

మహీంద్రా జావా 350

ప్రస్తుతం ప్రపంచ విపణిలో అన్ని మార్కెట్లు అనుమతించేలా అధునాత 350సీసీ కెపాసిటి గల బైకును సిద్దం చేసింది. ఆధునిక టెక్నాలజీ, పురాతణ డిజైన లక్షణాలు వీటి సొంతం. టూ వీలర్ల పరిశ్రమలో ఇలాంటి రెట్రో స్టైల్ స్కూటర్లు మరియు బైకులకు మంచి డిమాండ్ ఉంది.

మహీంద్రా జావా 350

డిజైన్

1960, 70 ల కాలం నాటి పాత డిజైన్ శైలిని నూతన జావా 350 బైకుల్లో యథావిధిగా అందిస్తోంది. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ లైట్, బాక్స్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, సమాంతరంగా ఉన్న సీటు బైకు రెట్రో శైలిలో మలచనున్నాయి. ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు కన్వెన్షనల్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పన్షన్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా జావా 350

బైకు డిజైన్ చాలా తక్కువగానే ఉంటుంది. దీంతో ప్రధానం భాగాల్లో వీలైనన్ని క్రోమ్ సొబగులు అందివ్వడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్, హెడ్ ల్యాంప్, హ్యాండిల్ బార్, రియర్ వ్యూవ్ మిర్రర్లు మరియు అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి వాటికి క్రోమ్ పూత పూయడంతో బైకు మొత్తం హుందాతనాన్ని సొంతం చేసుకుంది.

మహీంద్రా జావా 350

ఫీచర్లు

భారత్‌లో మళ్లీ విడుదలకు సిద్దమైన జావా బ్రాండ్, తమ జావా 350 బైకులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. జావా 350 బైకులో ముందు వైపు 305ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుక వైపున డ్రమ్ బ్రేక్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. ముందువైపు 19-అంగుళాల పరిమాణం గల వీల్, వెనుక 18-అంగుళాల పరిమాణం ఉన్న వీల్ కలదు.

మహీంద్రా జావా 350

జావా 350 బైకులో 17-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి ఉంది మరియు బైకు మొత్తం బరువు 154కిలోలు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తమ అప్ కమింగ్ మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసిందని చెప్పువచ్చు.

మహీంద్రా జావా 350

ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు గేర్‌బాక్స్

జావా 350 లో 350సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 5250ఆర్‌పిఎమ్ వద్ద 26బిహెచ్‌పి పవర్ మరియు 4750ఆర్‌పిఎమ్ వద్ద 32ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా జావా 350

జావా 350 గరిష్టంగా 120కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. యూరో 4 ఉద్గార నియమాలను పాటించే జావా 350సీసీ ఇంజన్, యూరోపియన్ మార్కెట్లో లభించే వాటిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో లభించనుంది.

మహీంద్రా జావా 350

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అతి త్వరలో పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమవుతున్న మహీంద్రా జావా 350 మోటార్ సైకిల్ యూరోపియన్ దేశాలతో పాటు ఇతర మార్కెట్లలోకి ఒక్కసారిగా ప్రవేశించనుంది. డిజైన్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్ పరంగా ఈ సెగ్మెంట్లో ఉన్న ఎన్నో మోడళ్లకు మహీంద్రా వారి జావా 350 గట్టి పోటీనివ్వనుంది. మరియు దీనిని 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించనుంది.

మహీంద్రా అభివృద్ది చేసిన జావా 350 దేశీయంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కు గట్టి పోటీనివ్వనుంది. జావా 350 బైకును రూ. 1.2 లక్షల నుండి రూ. 1.5 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Mahindra To Launch Jawa 350 In India — Here's All You Need To Know About The Legendary Motorcycle
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark