డ్యూక్ 250 కొత్త మోడల్ విడుదల చేసిన కెటిఎమ్: ధర, ఇంజన్ మరియు ఫీచర్ల కోసం

Written By:

అనేక రహస్య పరీక్షలు, వార్తలు మరియు రహస్య పరీక్షల అనంతరం, ఎట్టకేలకు డ్యూక్ 200 మోటార్ సైకిల్ నేడు కెటిఎమ్ ఇండియా లైనప్‌లోకి వచ్చి చేరింది. రూ. 1.7 లక్షల ప్రారంభ ధరతో కెటిఎమ్ ఈ కొత్త మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కెటిఎమ్ డ్యూక్ 250

కెటిఎమ్ విపణిలోకి డ్యూక్ 250 బైకును విడుదల చేసి తమ ఫోర్ట్‌ఫోలియోలో లభించే ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంది. డ్యూక్ 390 కు దగ్గరి పోలికలతో ఉన్నప్పటికీ చాలా వరకు విభిన్నమైన డిజైన్ శైలిలో ఉంది. దీనికి పెద్ద తోబుట్టువుగా వ్యహరించే డ్యూక్ 390 లోని ఫీచర్లు ఇందులో రాలేకపోయాయి.

కెటిఎమ్ డ్యూక్ 250

దేశీయ 250సీసీ సెగ్మెంట్లోకి కెటిఎమ్ విడుదల చేసిన డ్యూక్ 250 ప్రారంభ ధర రూ. 1.73 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

కెటిఎమ్ డ్యూక్ 250

సరికొత్త డ్యూక్ 250 పూర్తిగా కొత్త మోడల్. దేశీయంగా అందుబాటులో ఉంచడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే ఆలోచనలో ఉంది కెటిఎమ్. డ్యూక్ 390 తరహాలో అగ్రిసెవ్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలదు.

కెటిఎమ్ డ్యూక్ 250 సాంకేతిక వివరాలు

కెటిఎమ్ డ్యూక్ 250 సాంకేతిక వివరాలు

కెటిఎమ్ తమ డ్యూక్ 250 మోటార్ సైకిల్‌లో 248సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సింలిండర్ ఇంజన్ అందించింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 31బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఫీచర్లు

ఫీచర్లు

డ్యూక్ 250 లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో షాక్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్లిప్పర్ క్లచ్, ఎమ్ఆర్ఎఫ్ రెవ్జ్ సి1 టైర్లు కలవు.

కెటిఎమ్ డ్యూక్ 250

అయితే డ్యూక్ 390 లో ఉన్నటువంటి టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రైడ్ బై వైర్ వంటి ఫీచర్లు మిస్సయ్యాయి.

కెటిఎమ్ డ్యూక్ 250

పనితీరు పరంగా యమహా ఎఫ్‌జడ్ 25, బెనెల్లీ టిఎన్‌టి 25 మరియు కవాసకి జడ్250 వంటి వాటికి ఇది గట్టి పోటీనివ్వనుంది. కెటిఎమ్ తమ డ్యూక్ 250 విడుదల వేదిక మీదే 2017 డ్యూక్ 370 మోడల్ విడుదల చేసింది.

 
English summary
KTM Duke 250 Launched In India — India's All-New Duke
Story first published: Thursday, February 23, 2017, 16:06 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark