ప్రతిష్టాత్మక IMOTY 2018 అవార్డును వరించిన కెటిఎమ్ డ్యూక్ 390

Written By:

ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ టూ వీలర్ల తయారీ సంస్థ కెటిఎమ్ తమ సరికొత్త 2017 డ్యూక్ 390 మోటార్ సైకిల్‌కు గాను ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్(IMOTY) 2018 లభించింది.

కెటిఎమ్ డ్యూక్ 390

2017 ఏడాదిలో విడుదలైన మోటార్ సైకిళ్లలో కెటిఎమ్ డ్యూక్ 390 అతి ముఖ్యమైన మోడల్. కొత్త తరం నేక్డ్ స్ట్రీన్ ఫైటర్ స్పోర్ట్స్ బైకులో సరికొత్త డిజైన్ మరియు ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి.

Recommended Video - Watch Now!
The Emflux Motors Model 1 – India’s First Electric Motorcycle
కెటిఎమ్ డ్యూక్ 390

ఫైనల్ రౌండ్ కోసం మొత్తం 12 బైకులను ఎంపిక చేయగా, వాటిలో కెటిఎమ్ డ్యూక్ 390, యమహా ఎఫ్‌జడ్25 మరియు ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకుల తుదిజాబితాకు వచ్చాయి.

కెటిఎమ్ డ్యూక్ 390

ఫైనల్ లిస్టులో 107 పాయింట్లతో కెటిఎమ్ డ్యూక్ 390 టైటిల్ దక్కించుకోగా ఎఫ్‌జడ్25 మరియు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులు వరుసగా రెండు మరియు మూడవ స్థానంలో నిలిచాయి.

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ సరికొత్త 2017 డ్యూక్ 390 మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి 2017లో విపణిలోకి లాంచ్ చేసింది. అప్పట్లో మార్కెట్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మునుపటి తరం డ్యూక్ 390తో పోల్చితే, కొత్త తరం డ్యూక్ 390 సూపర్ 390 డ్యూక్ డిజైన్ అంశాలతో వచ్చింది.

కెటిఎమ్ డ్యూక్ 390

కొత్త తరం కెటిఎమ్ డ్యూక్ 390 బైకులో అధునాతన బైఫర్‌కేటెడ్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, అడ్జెస్టబుల్ లీవర్స్, రైడ్ బై వైర్ థ్రోటిల్ మరియు కొత్తగా డిజైన్ చేయబడిన టెయిల్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ ఓవరాల్ డిజైన్ షార్ప్ లుక్ సొంతం చేసుకుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

2017 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులో సాంకేతికంగా 373సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

ఆల్ న్యూ డ్యూక్ 390 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ స్పోర్ట్స్ బైకులో స్లిప్పర్ క్లచ్, అప్‌సైడ్ డౌన్ డబ్ల్యూపి ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డబ్ల్యూపి మోనోషాక్ అబ్జార్వర్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు మెట్జలర్ టైర్లు ఉన్నాయి.

కెటిఎమ్ డ్యూక్ 390

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో 300సీసీ నుండి 400సీసీ రేంజ్‌లో ధరకు తగ్గ విలువలు గల మోటార్ సైకిల్ కెటిఎమ్ డ్యూక్ 390 బెస్ట్ అని నిరూపించుకుంది. కొత్త డ్యూక్ 390 బైకును విరివిగా ఎంచుకుంటున్న కస్టమర్ల అపార నమ్మకమే ఇందుకు నిదర్శనం. ఇండియన్ రైడర్లకు హాట్ ఫేవరెట్ స్పోర్ట్స్ బైకుగా నిలిచిన కెటిఎమ్ డ్యూక్ 390 ని ప్రతిష్టాత్మక ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు వరించింది.

English summary
Read In Telugu: KTM Duke 390 Wins Indian Motorcycle Of The Year (IMOTY) 2018 Award

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark