350సీసీ పైబడి సామర్థ్యం ఉన్న టూ వీలర్లపై జిఎస్‌టి భారం ఎంతో తెలుసా ?

Written By:

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం, వస్తు సేవల పన్ను భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మీద ఊహించిన ప్రభావం ఏర్పడింది. అందులో ప్రత్యేకించి 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీద ట్యాక్స్ 31 శాతంగా ఖరారు చేశారు.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

నిజమే జిఎస్‌టి అమలయితే 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మొత్తంలో ధరలో 31 శాతం ట్యాక్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్‌టిని జూలై 1, 2017 నుండి అమలు చేయనున్నారు.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

జిఎస్‌టి కౌన్సిల్ తెలిపిన వివరాల మేరకు అన్ని రకాల టూ వీలర్ల మరియు మోపెడ్ల మీద ట్యాక్స్ 28 శాతంగా ఉంది. అయితే 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటికి అదనంగా మూడు శాతం ట్యాక్స్‌ను జోడించడం జరిగింది. దీంతో 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల చెల్లించాల్సిన ట్యాక్స్ 31 శాతానికి పెరిగింది.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

టూ వీలర్ల మీద జిఎస్‌టి ప్రకటించిన ట్యాక్స్ 28 శాతం మునుపు అమలవుతున్న ట్యాక్స్‌కు సమానంగానే ఉంది. కాబట్టి తక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

కానీ 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్లకు మునుపు అమలవుతున్న ట్యాక్స్ 28 శాతానికి మరో మూడు శాతం కలపడం ద్వారా ఈ బైకుల ధరలు మరింత పెరగనున్నాయి.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

నూతన ట్యాక్స్ విధానం, జిఎస్‌టిని జూలై 1 నుండి అమల్లోకి తీసుకురానున్నారు కాబట్టి అన్ని బైకులను సాధారణ ట్యాక్సుతో కొనుగోలు చేయవచ్చు. కాబట్టి 350సీసీకి పైబడి సామర్థ్యం ఉన్న బైకులను ఎంచుకునే వారు జూన్‌లోనే కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమం.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

జిఎస్‌టి గురించి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అధ్యక్షుడు వినోద్ దాసరి మాట్లాడుతూ, ప్రభుత్వం వెల్లడించిన జిఎస్‌టి ట్యాక్స్‌ల గురించి స్పందిస్తూ, ఇండస్ట్రీ ఊహించిదగిన రేట్లను జిఎస్‌టిలీ పొందుపరిచినట్లు వెల్లడించాడు. ఈ మార్పుల వలన భారత వాహన పరిశ్రమ మరింత బలపడనుందని పేర్కొన్నాడు.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

నూతన పన్ను విధానం జిఎస్‌టిలో వాహన పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన ట్యాక్స్ ప్రకారం, భవిష్యత్తులో వాహన పరిశ్రమలో డిమాండ్ పెరగడం మరియు తద్వారా భారత వాహన పరిశ్రమ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పుకొచ్చాడు.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

భవిష్యత్తులో మోటార్ సైకిళ్ల ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అయితే వాటిని సొంతం చేసుకునే తరుణంలో కస్టమర్లు కాస్త ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

ఇందుకు ప్రదాన కారణం, ప్రస్తుతం ఉన్న 28 శాతాన్ని 31 శాతానికి పెంచడం మరియు సర్వీసెస్ మీద ఉన్న 15 శాతం 18 కి పెరిగడం అదే విధంగా విడి భాగాలు మీద కూడా ట్యాక్స్ పెరగడంతో భవిష్యత్తులో టూ వీలర్ల కొనుగోళ్లు మరియు వాటి సర్వీసింగ్ భారం మరింత పెరగనుంది.

టూ వీలర్లపై జిఎస్‌టి ప్రభావం

జిఎస్‌టి అమలు ద్వారా పెరిగిన ట్యాక్స్ కొనుగోలుదారుడి మీద ప్రత్యక్షంగా పడదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌తో సహా ఎక్స్‌-షోరూమ్ ధరతో తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతాయి. కాబట్టి తయారీ సంస్థలు ఆ యా ఉత్పత్తుల మీద ఉన్న ట్యాక్స్‌ను లెక్కించి ధరలను పెంచుతాయి.

English summary
Read In Telugu Motorcycles Above 350cc Attract 31 Percent Tax New GST
Story first published: Monday, May 22, 2017, 13:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark