మరో ఆసక్తికరమైన మోడల్‌తో సిద్దమైన ఎమ్‌వి అగస్టా

Written By:

వెరోనా మోటార్ బైక్ ఎక్స్‌పో మరో పదిరోజుల్లో ఇటలీలోని వెరోనా నగరంలో ప్రారంభం కానుంది. 20,21,22 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ వాహన ప్రదర్శన వేదిక మీద ఎమ్‌వి అగస్టా ఆసక్తికరమైన మోడల్‌ డ్రాగ్‌స్టర్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్

దీనికి సంభందించిన సూచనలు చేస్తూ ఈ బైకు యొక్క టీజర్ ఫోటోను ఫేస్‌బుక్ మాధ్యమంలో పోస్ట్ చేసి టెక్నోఆర్ట్ సెర్సన్ మరియు వాల్టర్ మోటో లను ట్యాగ్ చేసింది. గతంలో బ్రుటాలె 800 లెవిస్ హామిల్టన్ ఎడిషన్ ను అభివృద్ది చేయడంలో ఎమ్‌వి అగస్టాతో ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి.

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్

ఇటాలియన్ మోటార్ సైకిళ్ల సంస్థ పరిచయం చేస్తున్న ఈ మరో స్పెషల్ ఎడిషన్ బైకులో ఎస్‌సి ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. మునుపటి మోడళ్ల కంటే ఇది మరింత ప్రీమియ్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల కానుంది.

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్ స్టాండర్డ్ వేరియంట్ 798సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఇన్‌లైన్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 123బిహెచ్‌పి పవర్ మరియు 81ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్

స్టాండర్డ్ వేరియంట్ ఇంజన్‌తో రానున్న ఈ స్పెషల్ ఎడిషన్ తక్కవ బరువున్న విడి భాగాలు మరియు అభివృద్ది పరచబడిన ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుండటంతో మరింత శక్తిని విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్...

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్

పెరిగిన వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ధరలు

డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ మరియు వాహన రిజిస్ట్రేన్ రుసుములను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేటి కథనంలో ధరల వివరాలు తెలుకోగలరు.

విదేశీ స్పోర్ట్స్ బైకులతో విసిగిపోయారా...? తక్కువ ధరతో, అత్యుతమ ఫీచర్లు మరియు ఇంజన్‌తో బజాజ్ ఓ బైకును విడుదల చేసింది. ధరకు తగ్గ విలువలతో విడుదలైన ఈ బైకు అనేక విదేశీ ఉత్పత్తులకు గట్టి పోటీనిస్తోంది. ఎలా ఉందో మీరే చూడండి... నచ్చితో కొనుగోలు చేయండి.

 

English summary
MV Agusta To Unveil Special Edition Dragster At Verona Motor Bike Expo
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark