హోండా ఆక్టివా 4జీ విడుదల: ధర, ఇంజన్, ప్రత్యేకతల కోసం....

Written By:

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి నాలుగవ తరానికి చెందిన ఆక్టివా స్కూటర్ 4జీ ను విడుదల చేసింది. బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ జోడింపుతో 110సీసీ గల ఇంజన్ అందించి, రూ. 50,730 లు ఎక్స్ షోరూం ఢిల్లీ ప్రారంభం ధరతో విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా ఆక్టివా 4జీ విడుదల

హోండా ఇందులో ముందు వైపున ఉన్న డిజైన్‌లో మార్పులు చేసింది. తొలగించడానికి వీలున్న ఫ్రంట్ సెంటర్ కవర్ డిజైన్‌‌ను మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే డిజైన్ మార్పును గుర్తించవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో అందివ్వడం జరిగింది.

హోండా ఆక్టివా 4జీ విడుదల

మునుపటి ఆక్టివా వేరియంట్లో ఉన్న ట్యూబ్ లెస్ టైర్లు, సీటు క్రింది స్టోరేజీ సామర్థ్యంతో పాటు CLIC మెకానిజాన్ని అందివ్వడం జరిగింది. (CLIC - Convenient Lift up Independent)

హోండా ఆక్టివా 4జీ విడుదల

సరికొత్త యాక్టివా 4జీ రెండు కొత్త రంగుల్లో లభించును. అవి, మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్ మరియు మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్.

హోండా ఆక్టివా 4జీ విడుదల

నూతన యాక్టివా 4జీలో కాంబి బ్రేక్ సిస్టమ్(CBS)ను ఈక్విలైజర్ సాంకేతికతతో అందివ్వడం జరిగింది. ఈక్విలైజర్ అనగా వెనుక బ్రేక్ అప్లే చేసిన తరువాత బ్రేక్ ఫోర్స్ ముందు మరియు వెనుక రెండు చక్రాలకు సమాతరంగా బ్రేక్ పవర్‌ను సరఫరా చేస్తుంది.

హోండా ఆక్టివా 4జీ విడుదల

సాంకేతికంగా ఇందులో 109సీసీ సామర్థ్యం గల హోండా ఎకో టెక్నాలజీ బిఎస్-IV ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అంతే కాకుండా ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ కలదు.

హోండా ఆక్టివా 4జీ విడుదల

దీని విడుదల వేదిక మీద హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ఆక్టివాను ఎంచుకున్న 1.5 కోట్ల భారతీయుల నమ్మకంతో ప్రపంచలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపాడు.

హోండా ఆక్టివా 4జీ విడుదల

తమ నాలుగవ తరం హోండా ఆక్టివా 4జీ లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్చ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్, రెండు నూతన కలర్ ఆప్షన్‌లతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం మొబైల్ చార్జింగ్ సాకెట్ అందివ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నాడు.

హోండా ఆక్టివా 4జీ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ దేశీయంగా జి310ఆర్ మోటార్ సైకిల్‌ను ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లోకి విడుదల చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మోటార్ సైకిల్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

 
Read more on: #హోండా #honda
English summary
New Honda Activa 4G Launched With BS-IV Engine; Priced At Rs 50,730
Story first published: Wednesday, March 1, 2017, 12:41 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark