రికార్డు స్థాయిలో పియాజియో స్కూటర్ల సేల్స్

Written By:

పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న వెస్పా మరియు అప్రిలియా స్కూటర్ల ద్వారా అత్యుత్తమ విక్రయాలు సాధించింది. ప్రత్యేకించి 2017 తొలి త్రైమాసికం (ఏప్రిల్-మే-జూన్) లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పియాజియో స్కూటర్ల సేల్స్

ఇటాలియన్ స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో గడిచిన త్రైమాసికంలో సేల్స్ పరంగా 90.97 శాతం వృద్దిని సాధించింది. సొసైటి ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలిపిన వివరాలు మేరకు, 2017 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో మొత్తం 13,572 స్కూటర్లు అమ్ముడుపోయాయి.

పియాజియో స్కూటర్ల సేల్స్

పియాజియో ఒక్క జూన్ 2017 లో 4,515 స్కూటర్లను విక్రయించి, 94 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే సేల్స్ గణనీయంగా పెరిగాయి. ప్రత్యేకించి పియాజియో లైనప్‌లోని అప్రిలియా ఎస్ఆర్ 150 మరియు వెస్పా 150 స్కూటర్లకు మంచి డిమాండ్ లభిస్తోంది.

పియాజియో స్కూటర్ల సేల్స్

సాధారణంగా ఇండియన్ కస్టమర్లు 100 నుండి 110సీసీ శ్రేణిలో ఉన్న హోండా ఆక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లను అధికంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో శక్తివంతమైన ఇంజన్ గల ఖరీదైన ప్రీమియమ్ స్కూటర్ల సేల్స్ ఆశించిన మేర ఉండవు. అయితే పియాజియో సేల్స్ గమనిస్తే ఇండియాలో ప్రీమియమ్ స్కూటర్లకు మంచి రోజులు రాబోతున్నాయని తెలుస్తోంది.

పియాజియో స్కూటర్ల సేల్స్

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ విషయానికి వస్తే, ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో 100సీసీ నుండి 125సీసీ ఇంజన్ రేంజ్‌లో 9.73 లక్షల స్కూటర్లు అమ్ముడుపోయాయి.

పియాజియో స్కూటర్ల సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్కువ ఇంజన్ కెపాసిటి గల బైకుల డిమాండ్ ఏ మేరకు పెరుగుతుందో అదే రీతిలో పవర్ స్కూటర్ల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. 100-125సీసీ కాదని 150సీసీ సామర్థ్యం ఉన్న స్కూటర్లను ఎంచుకునే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. కాబట్టి పియాజియో అప్రిలియా మరియు వెస్పా ద్వారా ప్రీమియమ్ స్కూటర్ల శకానికి నాంది పలికిందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Piaggio India Sales Grows Significantly — The Era Of Premium Scooters
Story first published: Thursday, July 20, 2017, 16:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark