రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

Written By:
Recommended Video - Watch Now!
మీకు తెలియని 11 టైటానిక్ ఫాక్ట్స్ | 11 Titanic Facts That You Didn't Know - DriveSpark

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ఎగ్జాస్ట్ పైపు నుండే వచ్చే శబ్దం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులు మరియు అభిమానులకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ ఇష్టం మరింత పెరిగి మోడిఫైడ్ సైలెన్సర్లతో వీధుల వెంబడి చక్కర్లుకొడితే వారికి ఇంకా మజా... కానీ, ఆ శబ్దం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ తీవ్ర చిరాకును తెప్పిస్తుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

ఇదే చిరాకు ట్రాఫిక్ పోలీసులకు వస్తే....? ఆ వస్తే....? ఇదిగో అలాంటి బైకుల సైలెన్సర్లు వారితోనే తీయించి, రోడ్డు మీద పరిచి రోడ్ రోలర్‌తో తొక్కిస్తారు. ఇవ్వన్నీ ఉత్తుత్తి కథలే అని పొరబడితే రేపు మీ బైక్‌కు కూడా ఇదే గతి పడుతుంది.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

పూనే, మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ మరియు కేరళలోని కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులు అనధికారికంగా అమర్చుకున్న సైలెన్సర్లను తొలగిస్తున్నారు. తొలగించిన సైలెన్సర్లను ఎటూ పనికిరాకుండా చేయడంతో పాటు, జరిమానా కూడా విధిస్తున్నారు.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 190(2) ప్రకారం, తయారీదారులు ఇచ్చిన సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకున్నట్లయితే, వారు చట్టపరంగా శిక్షార్హులు. వారికి జరిమానాతో పాటు అలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లను బైకు ఓనర్ల సమక్షంలోనే ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేయవచ్చు.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

తాజాగా, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అధిక శబ్దాన్నిచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల లౌడ్ సైలెన్సర్లను తొలగించారు. "ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ స్క్వాడ్ 11 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను సీజ్ చేసి, వాటి సైలెన్సర్లను ధ్వంసం చేసి ఆ బైకుల ఓనర్లకు జరిమానా విధించినట్లు" బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు.

Trending On DriveSpark Telugu:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు: నిపుణుల మాటల్లో!!

సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

అనధికారిక సైలెన్సర్లను రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వాడితే ఏమవుతుందో అని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫేస్‌బుక్స్ మాధ్యమంలో కొన్ని ఫోటోలు మరియు వీడియోను రివీల్ చేశారు. తొలగించిన అన్ని సైలెన్సర్లను రోడ్డు మీద పరిచి రోడ్ రోలరుతో తొక్కించారు.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

తొలగించిన సైలెన్సర్లు, అనధికారికంగా వినియోగించే హారన్‌లు మరియు మోడిఫైడ్ నెంబర్ ప్లేట్లను ఏం చేస్తారు అని ప్రశ్నించిన వారికి.... ఇదిగో ఇలా రోడ్ రోలర్‌తో తొక్కించేస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

బిగ్గరగా శబ్దం చేసే లౌడ్ సైలెన్సర్లను ఫిక్స్ చేసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను నడపడంతో వచ్చే శబ్దం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు మరియు జంతు పక్షులకు కూడా తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల నుండే వచ్చే శబ్దం స్టేటస్‌కు సింబల్‌గా భావించే ఆలోచనను మానేయడం బెటర్.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

శబ్దం కాలుష్యం ఎందుకు మంచిది కాదు

శబ్దం కాలుష్యం మానవ మరియు జంతు అవయవ పనితీరు మీద తీవ్ర దుష్ప్రవాన్ని చూపుతుంది. ఎక్కువ డెసిబల్ గల శబ్దం హృదయం మరియు మానవులలో స్పందనకు సంభందిచిన అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

మోడిఫైడ్ సైలెన్సర్లతో బైకులను నడపడం మానవులు, జంతువులు మరియు పర్యావరణంతో పాటు ఆ బైకు కూడా ఇబ్బందులపాలవుతుంది. ఉద్గార స్థాయిలను అర్థం చేసుకుని వాటికి అనుగుణమైన సైలెన్సర్లను ప్రత్యేకంగా పరిక్షించి అభివృద్ది చేసారు. ఇలా సైలెన్సర్లను మార్చడం గాలి కాలుష్యం, తక్కువ పికప్, మైలేజ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

English summary
Read In Telugu: Traffic Cops Crush Royal Enfield Exhausts Under Road Roller — Effects Of Noise Pollution
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark