ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

Written By:

మీరు పనిలో అత్యుత్తమ పనితీరును కనబరిస్తే... దాని ప్రతిఫలం సాలరీ హైక్ ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులకు అందిస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఈ యజమాని తమ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులకు విభిన్నమైన ప్రతిఫలం అందించాడు. ప్రతి ఉద్యోగి కూడా ఈ వార్తను చూసి, ఇక్కడ పనిచేసే వారు నక్కతోక తొక్కొచారంటారు.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

సూరత్‌లో లక్ష్మిదాస్ ఓ దిగ్గజ వజ్రాల వ్యాపారి. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఉత్తమ పనితీరు కనబరిచే వారికి 125 హోండా ఆక్టివా స్కూటర్లను బహుమానంగా ప్రదానం చేశాడు.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

విశ్వసనీయత పురస్కారాల ప్రధాన వేదికలో తమ ఉద్యోగులకు హోండా ఆక్టివా స్కూటర్లను బహుమానంగా అందివ్వడం జరిగింది.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

లక్ష్మిదాస్ వెకారియా 2010 లో వజ్రాల వ్యాపార ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా రెండవ అతి పెద్ద వజ్రాల వ్యాపారిగా నిలిచి ఉద్యోగులకు కానుకలిచ్చే రెండవ యజమానిగా కూడా ఈయన వార్తల్లోకి ఎక్కాడు.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

2016 లో మరో వజ్రాల వ్యాపారి శివ్‌జి ధోలకియా తమ ఉద్యోగులకు 1,260 ఫియట్ పుంటో కార్లు, 400 ఫ్లాట్లు మరియు ఆభరణాలను దీపావళి పర్వదిన సందర్భంగా ప్రదానం చేశాడు.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

దేశవ్యాప్తంగా హోండా ఆక్టివా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది. అత్యుత్తమ నాణ్యత, నిర్మాణ పరిమైన విలువలు మరియు విశ్వసనీయమైన ఉత్పత్తిగా దేశీయ స్కూటర్ల సెగ్మెంట్లో మంచి ఫలితాలను కనబరుస్తోంది.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

సాంకేతికంగా హోండా ఆక్టివా 4జీ స్కూటర్‌లో 109సీసీ సామర్థ్యం గల బిఎస్-IV ఇంజన్ కలదు, ఇది 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల సివిటి గేర్‌బాక్స్ ఉన్న ఆక్టివా 4జీ స్కూటర్ ప్రారంభ ధర రూ. 50,730 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

English summary
Read In Telugu To know About Surat Businessman Gifts 125 Honda Activa Scooters To His Employees
Story first published: Wednesday, April 26, 2017, 20:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark