ఉద్యోగులకు 1,260 కార్లను బహుకరించిన సూరత్ వజ్రాల వ్యాపారి
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ఈ ఏడాది కూడా వార్తల్లోకెక్కారు. దీపావళికి కానుకగా తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు ప్లాట్లు మరియు కార్లను బహుకరించారు.
పని చేస్తే అతని వద్దే పనిచేయాలి, యాజమాని అంటే అతను, బంగారంలాంటి మనసున్న యాజమానికి ఓ సరైన నిర్వచనం అని ఈ వార్తను చదివిన తరువాత అందరూ అతడినే పొగుడుతారు. తనతో పాటు తన వద్ద పని చేసే ఉద్యోగుల ఎదుగులను కూడా కోరుకునే ఈ వ్యక్తి గురించి మీరే చూడండి.

సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సవ్‌జి ధోలకియా ఎప్పటిలాగే తమ వద్ద పని చేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా 400 ప్లాట్లు మరియు 1,260 కార్లను బహుకరించారు.

ఈ కాలంలో ఉద్యోగులకు ఐదు లేదా పది వేల రుపాయలను బోనస్‌గా ఇచ్చి చేతులు దులుపుకునే యాజమానలకు కొదవే ఉండదు. అలాంటి వారందరికీ తలమానికం ఈ వజ్రాల వ్యాపారి.

ప్రతి ఏడాది కూడా తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఇతను భారీగా బోనస్‌లు ఇస్తుంటాడు.

ఈ ఏడాది బోనస్‌లు మరియు బహుమతుల కోసం సుమారుగా 51 కోట్లు రుపాయలను ఖర్చు చేసినట్లు తెలిసింది.

హరే క్రిష్ట డైమండ్ మరియు టెక్స్‌టైల్స్ ట్రేడర్ అయిన సవ్‌జి ధోలకియా గత ఏడాది దీపావళి సందర్భంగా 491 కార్లు మరియు 200 ప్లాట్లను పంచిపెట్టారు.

హరే క్రిష్ణ ఎక్స్‌పోర్టర్ సంస్థలో సుమారుగా 5500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరియు ఈ సంస్థ యొక్క టర్నోవర్ 6,000 కోట్ల రుపాయలుగా ఉంది.

పనితీరు ఆధారంగా ఎంపికచేయబడిన ఉద్యోగులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

ఇళ్ల స్థలాలను ముందుగా డౌన్‌పేమెంట్ చెల్లించి ఉద్యోగులక పంపిణీ చేయడం జరిగింది. ఆ తరువాత ఐదేళ్ల పాటు ఆ ప్లాట్లకు నెలసరి వాయిదా చెల్లించనుంది హరే క్రిష్ణ ఎక్స్‌పోర్టర్ సంస్థ.

- రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా జావా పేరుతో బైకులను ఉత్పత్తి చేయనున్న మహీంద్రా
- మార్కెట్‌కు గుబులుపెట్టిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ కొత్త రూపం
- మహీంద్రా ఎక్స్‌యూవీ500 5వ వార్షికోత్సవం: భారీ ఆఫర్లు


Click it and Unblock the Notifications








