సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ మీద బుకింగ్స్ ప్రారంభం

Written By:

సుజుకి తమ జిక్సర్ ఎస్ఎఫ్ ను ఏబిఎస్ వేరియంట్లో విడుదలకు సిద్దం చేస్తోంది అంటూ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బ్రోచర్ లీక్ అనే కథనాన్ని ఇది వరకే ప్రచురించాము. డ్రైవ్‌స్పార్క్ తెలుగు అంచనా నిజమైంది. సుజుకి టూ వీలర్స్ అధికారికంగా జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. అతి త్వరలో విడుదల కానున్న ఏబిఎస్ వెర్షన్ జిక్సక్ ఎస్‌ఎఫ్ ను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ మీద రూ. 10,000 రుపాయలతో బుకింగ్స్ ప్రారంభించినట్లు సౌత్ ఇండియాలోని డీలర్లు తెలిపారు. మరో వారం రోజుల్లో విడుదలయ్యి, పది రోజుల్లోడెలివరీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

జిక్సర్ లోని ఫ్యూయల్ ఇంజక్టడ్ వేరియంట్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సుజుకి అందిస్తోంది. అయితే ఎస్ఎఫ్ వేరియంట్లో ఇప్పుడు ఏబిఎస్ అందించిన తరువాత, ఆలస్యంగా స్టాండర్డ్ జిక్సర్‌లో కూడా ఏబిఎస్ రానుంది. ఏబిఎస్ వెర్షన్ జిక్సర్ సరికొత్త ఎస్‌పి కలర్ స్కీమ్‌లో లభించనుంది.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

జిక్సర్ శ్రేణిలో ఏబిఎస్ ఫీచర్ పొందుతున్న తొలి మోడల్ జిక్సర్ ఎస్ఎఫ్. అయితే సింగల్ ఛానల్ ఏబిఎస్‌గా ఫ్రంట్ వీల్‌కు మాత్రమే ఏబిఎస్ అందిస్తున్నట్లు తెలిసింది. బజాజ్ ఆర్ఎస్ 200 బైకులో ఇదే తరహా ఏబిఎస్ కలదు. జిక్సర్ ఎస్ఎఫ్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఏబిఎస్ వేరియంట్ త్రీ-టోనే పెయింట్ స్కీమ్ మరియు ఎస్‌పి లోగోతో రానుంది.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

మెకానికల్‌గా సరికొత్త జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు, సాంకేతికంగా ఇందులో 14.8బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల గాలితో చల్లబడే 154.9సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ ధర ఇంకా వెల్లడికాలేదు. అయితే డీలర్ల ప్రకారం, దీని ధర రూ. 1,20,000 లు ఆన్ రోడ్ గా లభించే అవకాశం ఉంది. జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 1,10,000 లు ఆన్ రోడ్‌గా ఉంది.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిక్సర్ శ్రేణిలో ఏబిఎస్ ఫీచర్‌తో వస్తున్న తొలి బైకు ఇది. ఇప్పటికే జిక్సర్‌కు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. పూర్తి స్థాయిలో జిక్సర్ ఏబిఎస్ వేరియంట్ అందుబాటులోకి వస్తే ఇదే రేంజ్‌లో ఉన్న ఇతర మోటార్ సైకిళ్లకు గట్టిపోటీనివ్వడం ఖాయం.

English summary
Read In Telugu; Suzuki Commence Bookings For Gixxer SF ABS
Story first published: Friday, August 4, 2017, 13:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark