బిఎస్ 4 ఇంజన్‌లతో సుజుకి లెట్స్ మరియు హయాతే విడుదల
సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విభాగం అప్‌డేట్స్ నిర్వహించిన లెట్స్ స్కూటర్ మరియు హయాతే బైకును దేశీయంగా విడుదల చేసింది. కొత్త విడుదల చేసిన చేసిన రెండు టూ వీలర్ల గురించి పూర్తి వివరాలు...
జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి యొక్క ఇండియా విభాగం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విపణిలోకి రెండు టూ వీలర్లను అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ప్రధానంగా తమ లెట్స్ స్కూటర్ మరియు హయాతే బైకుల్లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అందివ్వడం జరిగింది.

- సుజుకి లెట్స్ మోనో టోన్ కలర్ వేరియంట్ ధర రూ. 47,272 లు
- సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్ ధర రూ. 48,272 లు
- నూతన హయాతే ధర రూ. 52,754 లు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
- రేసింగ్ ఛాంపియన్ అశ్విన్, ఇతని భార్య బిఎమ్‌డబ్ల్యూ కారులో సజీవదహనం
- విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు
- కవాసకి జడ్ఎక్స్-10ఆర్ఆర్ విడుదల: ధర రూ. 22 లక్షలు
- భారీ ధరతో వేలంలో అమ్ముడైన ఎన్టిఆర్ బైకు
- మేడిన్ ఆంధ్రప్రదేశ్ కస్టమ్ యూనికార్న్ మోటార్ సైకిల్

గతంలో సుజుకి టూ వీలర్ల సంస్థ జిక్సర్ శ్రేణి మరియు యాక్సెస్ 125 స్కూటర్‌లో బిఎస్-IV నియమాలను పాటించే ఇంజన్‌లతో అప్‌డేట్స్ నిర్వహించింది. వచ్చే ఏప్రిల్ 2017 నుండి దేశవ్యాప్తంగా అన్ని మోటార్ సైకిళ్లు కూడా తప్పనిసరిగా బిఎస్-IV ఇంజన్‌లతోనే విడుదల కావాల్సి ఉంది.

ఈ రెండు వేరియంట్ల విడుదల కార్యక్రమంలో సుజుకి తెలిపిన ఓ ప్రకటన మేరకు, "ఈ రెండు వేరియంట్లను బిఎస్-IV ఇంజన్ అప్‌డేట్స్‌తో ప్రస్తుతం సుజుకి ఇండియా లైనప్‌లోని అన్ని వేరియంట్లు కూడా అప్‌డేట్స్‌తో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది."

సాంకేతికంగా సుజుకి హయాతే ఇపి మోటార్ సైకిల్‌లో 112.8సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ బిఎస్-IV ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వినియోగదారులు సుజుకి హయాతే ఇపి మోటార్ సైకిల్‌ను పర్ల్ మిరా రెడ్, మెటాలిక్ ఓర్ట్ గ్రే మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రంగుల్లో ఎంచుకోవచ్చు.

సుజుకి లెట్స్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 112సీసీ సామర్థ్యం గల బిఎస్-IV ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్ మరియు 8.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వినియోగదారులు దీనిని మూడు విభిన్నమైన డ్యూయల్ టోన్ రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, మట్టీ గ్రే మట్టీ బ్లాక్, పర్ల్ బ్లూ మట్టీ బ్లాక్, మరియు పర్ల్ మిరా రెడ్ మట్టీ బ్లాక్.





హ్యార్లీ డేవిడ్సన్ స్టీట్ రాడ్ 750 ఫోటోలు
అప్రిలియా ఎస్125 ఫోటోలు....


Click it and Unblock the Notifications








