జిఎస్‌టి అనంతరం మొదటి నెలలో టూ వీలర్ల సేల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి

Written By:

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద టూ వీలర్ల మార్కెట్ ఏదంటే ఇండియా అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మోటార్ సైకిళ్ల కంపెనీలు భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తూ, వార్షిక విక్రయాల్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్నాయి. రానున్న కాలంలో టూ వీలర్ల సేల్స్ ఊపందుకోనున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

మరి ఇండియాలో ప్రస్తుతం టూ వీలర్ల విక్రయాలు ఎలా ఉన్నాయి ? ఇండియన్ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయా...? లేదంటే అంతర్జాతీయ సంస్థలు దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమను శాసిస్తున్నాయా...? వంటి వివరాలతో ఇండియాలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ గురించి ఇవాళ్టి కథనంలో చూద్దా రండి...

Recommended Video
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

జూన్ 2017 మాసపు విక్రయాలు మీద దృష్టిసారిస్తే, జిఎస్‌టి అమలుతో ఇటు కొనుగోలుదారులు మరియు అటు విక్రయదారులు చాలా వరకు సంయమనం పాటించారని చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం, టూ వీలర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల మీద జిఎస్‌టి లెక్కించడంలో తలమునకలైతే, బైకుల ధరలు తగ్గుతాయా... పెరుగుతాయా అనే కోణంలో కొనుగోలుదారులు తికమకపడ్డారు. మొత్తానికి ఎప్పటిలాగే కాకుండా జూన్ 2017లో టూ వీలర్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

జూన్ 2017 లో అత్యుత్తమ సేల్స్ సాధించిన 10 బైకులు....

చివరి స్థానంలో బజాజ్ సిటి100 బైకు నిలిచింది. అధిక మైలేజ్ ఆశించే వారు, వయసు పైబడిన వారు, బడ్జెట్ రేంజ్‌ బైకు కావాలనుకునే వారు అధికంగా ఎంచుకునే మోడల్ బజాజ్ సిటి 100. అయితే జూన్ 2017 సేల్స్‌లో 36 శాతం వృద్దిని కోల్పోయి కేవలం 24,776 యూనిట్ల సిటి 100 మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

బజాజ్ ఆటోకు ప్రత్యక్ష పోటీగా చెప్పుకునే టీవీఎస్ మోటార్స్ అపాచే సిరీస్ మోటార్ సైకిళ్ల ద్వారా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. గత నెలలో 32,742 యూనిట్ల అపాచే సిరీస్ బైకులు అమ్ముడయ్యాయి. మే 2017తో పోల్చితే జిఎస్‌టి కారణంగా 12 శాతం సేల్స్ కోల్పోయింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

బజాజ్ పల్సర్ సిరీస్ బైకులు 37,503 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. కొత్త ట్యాక్స్ విధానంతో ధరలను నిర్ణయించడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న బజాజ్ చివరికి 25 శాతం వృద్దిని కోల్పోయింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ దేశవ్యాప్తంగా 42,149 యూనిట్ల విక్రయాలతో ఏడవ స్థానంలో నిలిచింది. మే 2017 విక్రయాలతో పోల్చుకుంటే రాయల్ ఎన్పీల్డ్ ఆరు శాతం వృద్దినిసాధించింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

ప్రపంచపు బెస్ట్ సెల్లింగ్ 125సీసీ మోటార్ సైకిల్‌గా నిలిచిన హోండా సిబి షైన్ జూన్ 2017 లో దేశవ్యాప్తంగా 69,108 యూనిట్ల విక్రయాలు సాధించి ఆరవ స్థానంలో నిలిచింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ హీరో మోటోకార్ప్‌కు చెందిన ప్యాసన్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది. జిఎస్‌టి అమలైన నెలలో 76,605 యూనిట్ల ప్యాసన్ బైకులు అమ్ముడయ్యాయి.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

తరువాత స్థానంలో హీరో గ్లామర్ 17 శాతం వృద్దిని నమోదు చేసుకుని 78,889 యూనిట్లను విక్రయించింది. అంతకు మునుపు మే 2017 లో 67,515 యూనిట్ల గ్లామర్ బైకులు అమ్మడుపోయాయి.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

హీరో మోటోకార్ప్ వారి మరో మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ 1,54,655 యూనిట్లతో జూన్ 2017 విక్రయాల్లో రెండవ స్థానంలో నిలిచింది. మే 2017 సేల్స్‌తో పోల్చుకుంటే 9 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్(బైక్)గా హీరో స్ల్పెండర్ మోటార్ సైకిల్ మొదటి స్థానంలో నిలిచింది. జిఎస్‌టి కారణంగా 7 శాతం వృద్దిని కోల్పోయింది. మొత్తానికి మోటార్ సైకిళ్ల విభాగంలో అత్యధికంగా హీరో వారి ఉత్పత్తులే ఉన్నాయి. దీంతో హీరో మోటోకార్ప్ ఎప్పటిలాగే భారత్ దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా నిలిచింది. మరిన్ని ఆటో న్యూస్ కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

Read more on: #టాప్ 10 #top 10
English summary
Read In Telugu: Top 10 Selling Bikes In India In June 2017 — GST Seems To Have Had A Massive Effect
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark