స్ట్రీట్ స్క్రాంబ్లర్ విడుదల తేదీ ఖరారు చేసిన ట్రయంప్

Written By:

ట్రయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియాలో తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునే క్రమంలో మరో బైకును విడుదలకు సిద్దం చేసింది. బ్రిటీష్‌కు చెందిన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంప్ వచ్చే ఆగష్టు 24 న విపణిలోకి స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైకును విడుదల చేయనుంది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

ట్రయంప్ ఇండియా లైనప్‌లోకి స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ బైకును విడుదల చేసి క్లాసిక్ మోటార్ సైకిళ్ల శ్రేణిని మరింత విసృతపరుచుకోనుంది. ట్రయంప్ క్లాసిక్ సిరీస్‌లో ఉన్న స్ట్రీట్ ట్విన్ బైకు ఆధారంతో స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేశారు.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

ట్రయంప్ వద్ద ఉన్న బొన్‌విల్ సిరీస్ బైకుల డిజైన్ లక్షణాలతో, తక్కువ బాడీ వర్క్ ఉండేలా జాగ్రత్త వహిస్తూ, స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైకును రూపొందించడం జరిగింది. తొలగించే వీలున్న పిలియన్ రైడర్ సీటు, పిలియన్ రైడర్ ఫుట్ పెడల్స్‌తో పాటు ప్రక్కవైపుకు ఉన్న ఎగ్జాస్ట్ పైపులు, అల్యూమినియం ర్యాక్ మరియు ఇంజన్ బుష్ ప్లేట్ వంటివి ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

స్ట్రీట్ ట్విన్ మోటార్ సైకిల్‌తో పోల్చితే, సన్నగా ఉన్న సీటు, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ మరియు తక్కువ ఎత్తును కల్పిస్తూ స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ను డిజైన్ చేసారు. రీడిజైన్ చేయబడిన స్టీల్ క్రాడిల్ ఛాసిస్ మీద ఇంజన్‌ ఫిక్స్ చేయబడింది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

సాంకేతికంగా స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌లో 900సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ ఇంజన్‌ కలదు. ఇది గరిష్టంగా 54బిహెచ్‌పి పవర్ మరియు 80ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఉత్తమ యాక్సిలరేటర్ రెస్పాన్స్ మరియు తక్కువ ఇంజన్ స్పీడ్ వద్ద అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయగలిగే విధంగా ఇంజన్‌ ట్యూన్ చేయబడింది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌లో రైడ్-బై-వైర్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది. ముందు వైపున కెవైబి ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 310ఎమ్ఎమ్ మరియు రియర్ వీల్‌కు 255ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైకులో ఆన్ రోడ్‌తో పాటు కొన్ని ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం అదనంగా స్క్రాంబ్లర్ స్టైల్ పరికరాలు అందివ్వడం జరిగింది. అయితే దీనిని హార్డ్ కోర్ ఆఫ్ రోడర్ లేదా డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌గా భావించలేము.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఉత్తమ ఆఫ్ రోడింగ్ లక్షణాలున్న ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ కఠినమైన మరియు దృఢమైన మోటార్ సైకిల్. ప్రస్తుతం విపణిలో ఉన్న డుకాటి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనివ్వనున్న ఇది ఎనిమిది లక్షల రుపాయల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Triumph Street Scrambler India Launch Details Revealed
Story first published: Wednesday, August 16, 2017, 16:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark