ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

ట్రయంప్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ట్రయంప్ బొన్‌విల్ ఫ్యామిలీలోకి వచ్చిన మరో మోటార్ సైకిల్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

ట్రైయంప్ బొన్‌విల్ కుటుంబంలో ఉన్న ఇతర మోటార్ సైకిళ్లతో పోల్చిచే డిజైన్ పరంగా ఇది విభిన్నంగా ఉంది. గ్రౌండ్ లెవల్ నుండి ఎత్తులో ఉన్న ఎగ్జాస్ట్ పైపులు. రీడిజైన్ చేసిన చిన్న సైజ్ సీటు, రియర్ సెక్షన్, మరియు డ్యూయల్ పర్పస్ టైర్లు ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

కొత్తగా విడుదలైన ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైకులో 900సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ హై టార్క్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ బైకు 54బిహెచ్‌పి పవర్ మరియు 78.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

ట్రయంప్ ఈ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌లో రైడ్-బై-వైర్ టెక్నాలజీ, ట్రాక్షన్ కంట్రోల్ మరియు అవసరాన్ని బట్టి ఆఫ్ లేదా అన్ చేసుకునే అవకాశం గల యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

ట్రయంప్ తమ స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ను ప్రత్యేకంగా స్క్రాంబ్లర్ కోసం రూపొందించిన ఛాసిస్ మీద నిర్మించింది. ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ మరియు 150 కు పైగా కస్టమైజ్డ్ యాక్ససరీలను పొందవచ్చు.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

అంతే కాకుండా, ముందు వైపున్న 19-అంగుళాల మరియు వెనుకవైపున్న 17-అంగుళాల స్పోక్ వీల్స్‌కు మెట్జలర్ టారన్స్ టైర్లు జోడించిండం జరిగింది. దీంతో ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ విన్యాసాలు చేయగలదు.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ జెట్ బ్లాక్, మ్యాట్ ఖాకి గ్రీన్, కొరోసి రెడ్ మరియు ఫ్రాజెన్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది. స్ట్రీట్ స్క్రాంబ్లర్ ప్రస్తుతం విపణిలో ఉన్న డుకాటి స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనిస్తుంది.

ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రూ. 8.10 లక్షల ధరల శ్రేణిలో, విభిన్న డిజైన్, శక్తివంతమైన ఇంజన్ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్లతో అత్యుత్తమ ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలతో విడుదలైంది. నిజానికి ఈ సెగ్మెంట్లో ఈ ధరకు స్ట్రీట్ స్క్రాంబ్లర్ బెస్ట్ ఛాయిస్. ధర గురించి చింతన లేని వారు ఇందులో ఉన్న 150 కస్టమైజ్డ్ యాక్ససరీల కోసం ప్లాట్ అవ్వడం ఖాయం!

English summary
Read In Telugu: Triumph Street Scrambler Launched In India; Priced At Rs 8.10 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark