18.75 లక్షల ఖరీదైన టైగర్ ఎక్స్‌ప్లోరర్ XCx బైకును విడుదల చేసిన ట్రైయంప్

Written By:

నేడు(25 జూల, 2017) ఇండియన్ మార్కెట్లోకి పద్దెనిమిది లక్షల డెబ్బైఐదు వేల రుపాయలతో ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు లాంచ్ అయ్యింది. ఇంత ఖరీదైన బైక్ ఇండియాలో విడుదలయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారా... నిజంగానే విడుదలయ్యింది.

రూ. 18.75 లక్షలు విలువ చేసే ఈ బైకులో ప్రత్యేకతలేంటో నేటి కథనంలో చూద్దాం రండి....

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

గతంలో ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ మోటార్ సైకిల్‌ కేవలం ఎక్స్‌సి వేరియంట్లో మాత్రమే లభించేది. అయితే బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ అప్‌గ్రేడ్ కోసం ట్రైయంప్ దీనిని మార్కెట్ నుండి తొలగించింది. అదే మోడల్‌ను ఇప్పుడు మళ్లీ దేశీయంగా విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

సరికొత్త 2017 టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకులో బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే 1215సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 9,300ఆర్‌పిఎమ్ వద్ద 137బిహెచ్‌పి పవర్ మరియు 6,200ఆర్‌పిఎమ్ వద్ద 123ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

బ్రిటీష్‍‌కు చెందిన ట్రయంప్ తమ ఉత్పత్తుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందివ్వడంలో ప్రఖ్యాతగాంచింది. స్పోర్ట్, కంఫర్ట్ మరియు నార్మల్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌‌తో పాటు రైడ్-బై-వైర్ టెక్నాలజీ కలదు. అంతే కాకుండా ఇందులో కార్నరింగ్ ఏబిఎస్, మల్టీ ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు స్లిప్-అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయంతో పాటు తొమ్మిది రకాల ఆన్ రోడ్ మరియుఆఫ్ రోడ్ సస్పెన్షన్ సెట్ చేసుకునే వీలున్న ట్రైయంప్ సెమీ ఆక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్(TSAS) మరియు రైడింగ్ సౌలభ్యాన్ని పెంచేందుకు ట్రైయంప్ సంస్థ కాంటినెంటల్ ఏజి భాగస్వామ్యంతో రూపొందించిన ఇనర్షియల్ మెసర్‌మెంట్ యూనిట్(IMU)అందివ్వడం జరిగింది.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ మోటర్ సైకిల్‌లో అందించిన IMU ద్వారా ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని నియంత్రించవచ్చు. మరియు ఆరు యాక్సిస్‌లలో బైకు కదలికలకు సంభందించిన సమాచారాన్ని సెన్సార్ల ద్వారా సేకరిస్తుంది.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

రైడర్ మీద ఒత్తిడి తగ్గించేందుకు హైడ్రాలిక్ ఆధారిత క్లచ్ లివర్ కలదు. ట్రైయంప్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో ముందు 19-అంగుళాల పరిమాణం ఉన్న స్పోక్స్ వీల్ మరియు వెనుక వైపున 17-అంగుళాల పరిమాణం ఉన్న స్పోక్స్ వీల్ కలదు.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

మెరుగైన టూరింగ్ రైడింగ్ కోసం ఫస్ట్ ఇన్ క్లాస్ ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్, 12వోల్ట్ పవర్ సాకెట్స్ మరియు 5వోల్ట్ అండర్ సీట్ యుఎస్‌బి సాకెట్, హీటెడ్ సీట్స్ మరియు లగేజ్ బ్యాగులు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

అడ్వెంచర్, ఆఫ్ రోడింగ్ మరియు టూరింగ్ కోసం వినియోగించే ఈ బైకులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి, నిజానికి ఇది 22 లక్షల ధరతో విడుదలయ్యే అవకాశాలు ఉండేవి. అయితే చాకచక్యంగా దీనిని 18.75 లక్షల ధరతో ప్రవేశపెట్టింది.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ బైకు విడుదల

ఇండియన్ మార్కెట్లో ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్‌సిఎక్స్ మోటర్ సైకిల్‌‌కు పోటీగా డుకాటి మల్టీస్ట్రాడా 1200ఎండ్యురో మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ లను చెప్పుకోవచ్చు. ఫీచర్లకు తగ్గ ధరతో విడుదలైనప్పటికీ పోటీదారుల కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంది.

ఇదే సెగ్మెంట్లో హోండా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్లోకి ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను 12.90 లక్షల ధరతో విడుదల చేసింది.మీ నగరంలో రోజు వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇక్కడ తెలుసుకోండి....

English summary
Read In Telugu: Triumph Tiger Explorer XCx Launched In India: Priced At Rs 18.75 Lakh
Story first published: Tuesday, July 25, 2017, 16:26 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark