డిసెంబర్ మొదటి వారంలో వస్తోన్న టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైక్

Written By:

దక్షిణ భారతదేశానికి చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరియు జర్మన్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ సంయుక్తంగా అభివృద్ది చేసిన బైకును విపణిలోకి విడుదల చేయడానికి టీవీఎస్ సర్వం సిద్దం చేసుకుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ ఇండియా లైనప్‌లోకి తొలి కంప్లీట్ స్పోర్ట్స్ బైకుగా అపాచే ఆర్ఆర్ 310(అకులా) మోటార్ సైకిల్ డిసెంబర్ 6, 2017 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ బైకు గురించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్లు మరియు ఫోటోలు ఇవాళ్టి కథనంలో వివరంగా...

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ మోటార్స్ ఈ బైకును అకులా పేరుతో కాన్సెప్ట్ రూపంలో ఢిల్లీలో జరిగిన 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలిసారిగా ఆవిష్కరించింది. తరువాత కొంత కాలానికి పలుమార్లు రహదారి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుని ప్రొడక్షన్ దశకు చేరుకుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

తొలినాళ్లలో దీనిని అకులా మోనికర్ అనే పేరుతో పరిచయం చేసిన టీవీఎస్, ఇప్పుడిది విడుదల కానున్న నేపథ్యంలో దీనికి అపాచే ఆర్ఆర్ 310 అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ధరకు తగ్గ విలువల గల అత్యుత్తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుగా దీనిని చెప్పుకోవచ్చు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 విపణిలో ఉన్న కెటిఎమ్250/390 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 బైకులతో పాటు ధర పరంగా బజాజ్ డామినర్ 400 తో పోటీ పడనుంది. స్పెసిఫికేషన్స్ ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకులో అందించిన అదే ఇంజన్‌ను టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 లో అందిస్తోంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

సాంకేతికంగా ఇందులో ఉన్న శక్తివంతమైన 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ 9,500ఆర్‌పిఎమ్ వద్ద 34బిహెచ్‌పి పవర్ మరియు 7,500ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

అన్ని బైకుల్లో ఉండే ఇంజన్ తరహాలో కాకుండా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇంజన్‌కు ముందు భాగంలో ఫ్యూయల్ ఇంటేకర్ ఉంటే, ఇంజన్ వెనుక భాగంలో ఎగ్జాస్ట్ పోర్ట్ ఉంటుంది. సాధారణంగా మనం చూసే బైకులో ఈ రెండూ రివర్స్‌గా ఉంటాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ మోటార్స్ బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ బైకులను మరియు అపాచే ఆర్ఆర్ 310 బైకులను హోసూర్ లోని టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ సమక్షంలో ఉత్పత్తి అవుతుండటంతో ప్రతి బైకు కూడా అత్యుత్తమ నిర్మాణ మరియు నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ తమ అపాచే ఆర్ఆర్ 310 బైకులను దేశవ్యాప్తంగా ఉన్న విక్రయ కేంద్రాలలో అందుబాటులో ఉంచనుంది. ఇదే ఇంజన్‌తో వస్తున్న బిఎమ్‌మడబ్ల్యూ జి310 ఆర్ బైకులను బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ షోరూమ్‌లలో విక్రయించనుంది.

English summary
Read In Telugu: TVS Apache RR 310 (Akula) India Launch Date Revealed; Specifications, Features & Images
Story first published: Thursday, November 23, 2017, 14:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark