తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్న టీవీఎస్

దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ మీద దృష్టిసారించింది.

By Anil

దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ మీద దృష్టిసారించింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు టీవీఎస్ ప్రతినిధులు ఓ ప్రకటనలో అధికారికంగా స్పష్టం చేసారు.

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విపణిలోకి తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ ద్వారా ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఇప్పటికే టీవీఎస్‌కు మంచి సక్సెస్ సాధించి పెట్టిన జూపిటర్ స్కూటర్ ఆధారంగా దీనిని అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ దశకు చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వినియోగించే ఎలక్ట్రిక్ మోటర్, విడి పరికరాల సేకరణ మరియు తయారీకి సంభందించిన ప్రణాళికలను మీడియాతో పంచుకోవడానికి నిరాకరించింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద టీవీఎస్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

టీవీఎస్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి 125సీసీ సామర్థ్యంతో మరో కొత్త స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. టీవీఎస్ తాజాగా తమ జూపిటర్ స్కూటర్ల శ్రేణిలోకి క్లాసిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

వచ్చే ఏడాది మధ్యే భాగానికి విక్రయాలకు సిద్దమయ్యే అవకాశం ఉన్న టీవీఎస్ వారి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర జూపిటర్ వంటి పెట్రోల్ ఇంధనంతో నడిచే స్కూటర్ కన్నా అధికంగానే ఉండనుంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశవ్యాప్తంగా టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ తయారీ సంస్థలు స్వతహాగా ఎలక్ట్రిక్ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియోగం పరంగా అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో వ్యక్తిగత రవాణాలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS Working On New Electric Scooter
Story first published: Wednesday, August 9, 2017, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X