2017 లో విడుదల కానున్న బైకులు

2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

By Anil

2017 ఏడాది అనేక బైకుల విడుదలకు వేదిక కానుంది. భారీ స్థాయిలో కార్ల విడుదలకు సిద్దమైన 2017 లో ఓ మోస్తారు సామర్థ్యం గల శక్తివంతమైన స్పోర్టివ్ శైలిలో ఉన్న బైకులు విడుదల కానున్నాయి. పనితీరు పరంగా టూ వీలర్లను ఎంచుకునే బైకు ప్రియులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

నేటి కథనంలో 2017 లో విడుదల కానున్న బైకుల విడుదల వివరాలతో పాటు ధర మరియు సాంకేతిక సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

1. టీవీఎస్ అకులా310

1. టీవీఎస్ అకులా310

తక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల తయారీతో ప్రారంభమైన టీవీఎస్ ఇప్పుడు అనేక సెగ్మెంట్లలో తమ టూ వీలర్లను విడుదల చేసింది. గరిష్ట పనితీరు గల ఉత్పత్తుల అభివృద్ది కోసం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందం ఆధారంగా బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ ను అభివృద్ది చేసాయి. దీని ఆధారంగా టీవీఎస్ తమ అకులా 310 బైకును అభివృద్ది చేసి 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

అకులా 310 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

అకులా 310 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

సాంకేతికంగా టీవీఎస్ మోటార్స్ సంస్థ ఈ అకులా 310 బైకులో బిఎమ్‌డబ్ల్యూ వారి 313సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ నీటితో చల్లబడే ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 33.4బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లోని యమహా ఆర్3, కెటిఎమ్ ఆర్‌సి390 లకు పోటీనివ్వగలిగే దీనిని ఆపాచే ఆర్‌టిఆర్ 300 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

  • ధర అంచనా: రూ. 1.50 నుండి 1.80 లక్షల మధ్య
  • విడుదల అంచనా: మార్చి - ఏప్రిల్ 2017
  • 2. యమహా ఆర్15 వి3.0

    2. యమహా ఆర్15 వి3.0

    జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తమ తరువాత తరం ఆర్15 మోటార్ సైకిల్ అభివృద్ది మీద దృష్టిసారించింది. యమహా ఇప్పటికే తమ ఆర్15 వి3.0 మోడల్ న ఇండోనేషియా రోడ్ల మీద పలుమార్లు పరీక్షలు నిర్వహించింది. దేశీయ విపణిలో యమహాకు అత్యుత్తమ అమ్మకాలు సాధించిపెడుతున్న వాటిలో ఆర్15 ఒకటి. ఈ తరువాత తరం మోడల్‌ బైకులో బ్లూ షేడ్స్ మరియు శక్తివంతమైన ఇంజన్‌ను అందిస్తోంది.

    ఆర్15 వి3.0 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

    ఆర్15 వి3.0 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

    యమహా ఈ నెక్ట్స్ జనరేషన్ ఆర్15 వి3.0 బైకులో 155సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎస్‌ఒహెచ్‌సి పరిజ్ఞానం గల ఇంజన్‌‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేరప్‌బాక్స్ అనుసంధానంతో అందిస్తోంది. ఇది 18 నుండి 20 బిహెచ్‌పి మధ్య పవర్ మరియు 17 నుండి 18 మధ్య గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

    • ధర అంచనా: రూ. 1.20 లక్షల ప్రారంభ ధరతో
    • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
    • 3.హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

      3.హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

      సరసమైన టూవీలర్ల సెగ్మెంట్ అనంతరం హీరో మోటోకార్ప్ ఇప్పుడు పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల మీద దృష్టిసారించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకును గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. దీనితో పాటు ఎక్స్ఎఫ్3ఆర్, మరియు ఎచ్ఎక్స్250ఆర్ మోడళ్లను కూడా కొలువుదీర్చిందించి.

      ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

      ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

      ఈ నూతన మోటార్ సైకిల్‌లో 200సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందిస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్న ఇది గరిష్టంగా 18.5బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

      • ధర అంచనా: రూ. 90,000 నుండి 1,10,000 మధ్య ధరతో
      • విడుదల అంచనా: 2017 మార్చి లోపు
      • 4. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

        4. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

        దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్‌తో కలిసి బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ అభివృద్ది చేసిన బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకును ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని దేశీయంగా ఇప్పటికే పలుమార్లు పరీక్షించింది మరియు హోసూర్ ఆధారిత ప్లాంటులో ఉత్పత్తి చేయడానికి బిఎమ్‌డబ్ల్యూ సంసిద్దతను వ్యక్తం చేసింది.

        బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

        బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

        బిఎమ్‌డబ్ల్యూ సాంకేతికంగా ఈ జి310ఆర్ బైకులో 313సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ వాటర్ కూల్డ్ ఇంజన్ అందించింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

        • ధర అంచనా: రూ. 2 నుండి 2.5 లక్షల మధ్య ధరతో
        • విడుదల అంచనా: మార్చి - ఏప్రిల్ 2017
        • 5. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఎస్

          5. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఎస్

          బిఎమ్‌డబ్ల్యూ డి310ఎస్ అంతర్జాతీయ మార్కెట్ కోసం అందుబాటులోకి రానున్న అత్యంత సరసమైన అడ్వెంచర్ బైకు. బిఎమ్‌డబ్ల్యూ దీనిని జి310ఆర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించింది. ఈ జి310 ఎస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో మరియు ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది.

          బిఎమ్‌డబ్ల్యూ జి310 ఎస్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

          బిఎమ్‌డబ్ల్యూ జి310 ఎస్ సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

          బిఎమ్‌డబ్ల్యూ సాంకేతికంగా ఈ జి310ఎస్ బైకులో కూడా తమ అదే 313సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ వాటర్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

          • ధర అంచనా: రూ. 2.5 లక్షల ప్రారంభ ధరతో
          • విడుదల అంచనా: 2017 చివరి నాటికి
          • 6. 2017 కెటిఎమ్ డ్యూక్ 390/200

            6. 2017 కెటిఎమ్ డ్యూక్ 390/200

            ఆస్ట్రియన్‌కు చెందిన టూ వీలర్ల తయారీ సంస్థ కెటిఎమ్ దేశీయంగా ఉన్న తమ డ్యూక్ 390 మరియు డ్యూక్ 200 మోడళ్లను అప్‌డేటెడ్ వర్షన్‌లో 2017 నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. గత ఏడాది జరిగిన మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ఈ రెండు 2017 మోడళ్లను ప్రదర్శించింది. వీటి బుకింగ్స్‌ను 2017 ఏప్రిల్ నుండి ప్రారంభించే సూచనలున్నాయి.

            2017 కెటిఎమ్ డ్యూక్ 390/200 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

            2017 కెటిఎమ్ డ్యూక్ 390/200 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

            కెటిఎమ్ తమ 2017 డ్యూక్ లో 373.2సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ అందివ్వనుంది. ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. మరియు ఇది గరిష్టంగా 169కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక డ్యూక్ 200 వేరియంట్ అదే 200సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో రానుంది.

            • ధర అంచనా: రూ. 2.30 లక్షల నుండి
            • విడుదల అంచనా: జనవరి - మార్చి 2017
            • 7. బెనెల్లీ టిఎన్‌టి 135

              7. బెనెల్లీ టిఎన్‌టి 135

              బెనెల్లీ తమ టిఎన్‌టి 135 మోటార్ సైకిల్‌ను తొలిసారిగా 2015 ఏకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది. ఆ తరువాత దేశీయ విపణిలోకి విడుదల చేసే ఉద్దేశ్యంతో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ఈ మోడల్‌కు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలాంటి పోటీ లేదు.

               బెనెల్లీ టిఎన్‌టి 135 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

              బెనెల్లీ టిఎన్‌టి 135 సాంకేతిక, విడుదల మరియు ధర విరాలు

              సాంకేతికంగా ఈ బెనెల్లీ 135 బైకులో 135సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 12.4బిహెచ్‌పి పవర్ మరియు 10.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. బెనెల్లీ లైనప్‌లో ఉన్న ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైకు ఇదే.

              • ధర అంచనా: రూ. 1.50 లక్షల నుండి
              • విడుదల అంచనా: మార్చి 2017 నాటికి
              • 8. యమహా ఎఫ్‌జడ్ 250/ఎఫ్‌జడ్25

                8. యమహా ఎఫ్‌జడ్ 250/ఎఫ్‌జడ్25

                జపాన్ టూ వీలర్ల దిగ్గజ దేశీయంగా పావు వంతు సామర్థ్యం ఉన్న బైకులను పరిచయం చేయడానికి అమితాసక్తితో ఉంది. వాటి పేర్లు ఎఫ్‌జడ్250 మరియు ఎఫ్‌జడ్25లుగా ఉన్నాయి. ప్రస్తుతం తమ లైనప్‌లో ఉన్న ఆర్3 మోడల్‌కు దిగువ స్థానంలో నిలవనుంది.

                2017 లో విడుదల కానున్న బైకులు

                యమహా ఎఫ్‌జడ్ 250/ఎఫ్‌జడ్25 లో 249సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ రానుంది. ఇది గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 21ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

                ధర అంచనా: రూ. 1.3 నుండి 1.5 లక్షల మధ్య ధరతో

                విడుదల అంచనా: జనవరి 24, 2017 నాటికి

Most Read Articles

English summary
Most Awaited Upcoming New Bikes In India in 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X