ఆర్15 థర్డ్ వెర్షన్ స్పై ఫోటోలు

Written By:

యమహా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన వైజడ్‌ఎఫ్ ఆర్15 లో ఇరు వైపులా కోణీయాకృతిలో ఉన్న ఫ్రేమ్ డీకాల్స్ దీనికి రైడింగ్ సమయంలో అత్యుత్తమ దృఢత్వాన్ని మరియు రైడర్‌లో మంచి విశ్వాసాన్ని నింపుతుంది. బహుశా ఈ కారణం చేత ఇప్పటికీ అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తూనే ఉంది. దీనికి కొనసాగింపుగా గతంలో వి2.0 వెర్షన్‌ను విడుదల చేసిన యమహా ఇప్పుడు మళ్లీ కొనసాగింపుగా వి3.0 వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

మూడవ తరం ఆర్15 గా అతి త్వరలో యమహా ఇండియా విడుదల చేయనున్న వైజడ్ఎఫ్ ఆర్‌15 వి3.0 మోడల్ కు చివరి దశ పరీక్షలను పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో ఆలస్యంగా దీని విడుదల ఉన్నట్లు తెలిసింది.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

యమహా ఆర్125 యూరప్ మోడల్ డిజైన్ భాష ఆధారంగా ఈ థర్డ్ జనరేషన్ ఆర్15 వి3.0 ను డిజైన్ చేయడం జరిగింది. ముందు వైపు డిజైన్‌లో అగ్రెసివ్‌గా ఉన్న హెడ్ ల్యాంప్స్‌కు తోడుగా అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. ఇందులోని అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్15 వి2.0 లో గుర్తించవచ్చు.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

సాంకేతికంగా ఈ అప్ కమింగ్ ఆర్15 వి3.0 బైకు 155సీసీ సామర్థ్యం గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది, ఇది గరిష్టంగా 20బిహెచ్‌పి పవర్ మరియు 18ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

యమహా వారి ఎన్‌మ్యాక్స్ స్కూటర్ సేకరించిన ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానం చేయడం జరిగింది.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

యమహా వారి ఆర్15 శ్రేణిలోని అన్ని వేరియంట్లలో బాగా పాపులర్‌గా నిలిచిన త్రికోణాకృతిలో ఉన్న సైడ్ బాడీ డీకాల్స్ ఇందులో యథావిదంగా రానున్నాయి. రైడర్లకు ఇది విశ్వాసాన్ని మరియు గొప్ప రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

ఈ నూతన ఆర్15 వి3.0 లో గుర్తించదగిన ఫీచర్లలో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, పెద్ద ఎయిర్ ఇంటేకర్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వంటి ఫీచర్లు ఇందులో పరిచయం కానున్నాయి.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

మూడవ తరం ఆర్15 లో రెండు చక్రాలకు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనుసంధానం ఉన్న డిస్క్ బ్రేకులు కలవు. ఇక ఇంటీరియర్ కలర్స్ పరంగా రేసింగ్ బ్లూ, గ్రే, రెడ్ మరియు వైట్ వంటి కాంబినేషన్లలో ప్రముఖంగా రానుంది.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

ప్రస్తుతం యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 మోడల్ బైకు ఇండియన్ మార్కెట్లో రూ. 1.18 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. అయితే త్వరలో విడుదల కానున్న థర్డ్ వెర్షన్ ఆర్15 సుమారుగా రూ. 1.20 నుండి 1.30 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

2017 లో విడుదల కానున్న బైకులు

2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 వి3.0

బేబీ డాల్ సన్నీలియోన్ హాట్ కార్ కలెక్షన్

గూగుల్ శోధనలో ఎక్కువ మంది వెతికిన శృంగార తరహా నటులలో సన్నీ లియోన్ మొదటి స్థానంలో ఉంది. నేడు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ పాఠకుల కోసం బేబీ డాల్ హాట్ కార్ల గురించి ప్రత్యేక కథనం...

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha YZF-R15 V3.0 Flaunts Its Curves; Spy Image Reveals
Story first published: Tuesday, January 10, 2017, 16:15 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark