Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 17 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జావా మోటార్ సైకిల్ విడుదలను ఖరారు చేసిన ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రీమియం టూ-వీలర్ల వ్యాపారంలో భాగంగా 2016లో జావా మరియు బిఎస్ఎ బ్రాండ్లను సొంతం చేసుకుంది. తమ భాగస్వామ్య దిగ్గజం క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(CLPL) ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా, ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మహీంద్రా ఉత్పత్తి చేయనున్న జావా మోటార్‌సైకిల్స్ గురించిన టీజర్‌ను ట్వీట్ చేశాడు.

ఇండియన్ మార్కెట్లో జావా మోటార్‌సైకిల్స్ కంపెనీ పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైందని ఆనంద్ మహీంద్రా తాజాగా చేసి ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. కానీ, ట్విట్టర్‌లో ఉపయోగించిన ఫోటో మాత్రం 2002 యమహా వైజడ్ఎఫ్-ఆర్1.
|
అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాలోని తాజా ట్వీట్ మేరకు, మహీంద్రా అండ్ మహీంద్రా అతి త్వరలో జావా మోటార్‌సైకిల్స్‌కు పునరుజ్జీవం ఇస్తున్నట్లు గుర్తుచేస్తున్నాడు. జావా బైక్ ప్రేమికుల కోసం అతి త్వరలో కార్యకవాపాలను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రారంభించనుంది.

గతంలో నవంబరు 2017న మహీంద్రా చేసిన ప్రకటన ప్రకారం, మొదటి జావా బైకును మార్చి 2019 లోపు విడుదల చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. మహీంద్రా జావా మోటార్‌సైకిల్ బ్రాండు పేరు క్రింద ప్రీమియం సెగ్మెంట్లో నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. వీటి కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక జావా విక్రయ కేంద్రాలను కూడా ప్రారంభించనుంది.

ఇటీవల విడుదలైన సమచారం మేరకు, అప్ కమింగ్ జావా బైకుల కోసం మహీంద్రా వారి మోజో 300సీసీ ఇంజన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొదటి జావా మోటార్ సైకిల్‌ను కూడా 300సీసీ ఇంజన్ రేంజ్‌లో, అదే ఇంజన్ కెపాసిటీతో మహీంద్రా మోజో ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనున్నారు.

2018మే నెలలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన కంపెనీ జావా 350 స్పెషల్ కఫే రేసర్ బైకును యూరోపియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. జావా మోటార్‌సైకిల్స్ సుసంపన్న రేసింగ్ వారసత్వాన్ని పురస్కరించుకుని జావా 350 స్పెషల్ బైకును రూపొందించింది. అదే మునుపటి డిజైన్‌ను ప్రతిబింబించే పలు డిజైన్ అంశాలతో ఈ స్పెషల్ ఎడిషన్ బైకును నిర్మించారు.

జావా 350 స్పెషల్ ఎడిషన్ బైకులో సాంకేతికంగా 397సీసీ కెపాసిటి గల ట్విన్-ప్యార్లల్ ఇంజన్ కలదు, ఇది 27.6బిహెచ్‌పి పవర్ మరియు 30.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను చైనా తయారీదారు నుండి సేకరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఈ మధ్య కాలంలో మోడ్రన్ డిజైన్‌లో ఉన్న బైకుల కంటే పాత కాలం నాటికి క్లాసిక్ డిజైన్ శైలిలో ఉన్న బైకుల మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోంది. అత్యంత పురాతణమైన జావా మోటార్‍సైకిల్ బైకులకు అభిమానులు భారీగా ఉన్నారు. మహీంద్రా పరమైన ఈ జావా కంపెనీ నుండి కొత్త తరం బైకులు అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల అవుతాయని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పరోక్షంగా ట్వీట్ చేస్తూ తెలిపాడు.