125సీసీ స్కూటర్ కొంటున్నారా...? అయితే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!!

Written By:

ఇటలీకి చెందిన దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఎస్ఆర్ 150 స్కూటర్ యొక్క తక్కువ కెపాసిటి గల వెర్షన్ ఎస్ఆర్ 125.

అప్రిలియా ఎస్ఆర్ 125

డిజైన్ పరంగా చూడటానికి అచ్చం ఎస్ఆర్ 150 స్కూటర్‌ను పోలి ఉన్న ఎస్ఆర్ 125 ప్రారంభ ధర రూ. 65,310 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మీరు కనుక 125సీసీ స్కూటర్ కొనాలని చూస్తుంటే విపణిలో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హోండా యాక్టివా 125 మరియు సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లకు పోటీగా వచ్చిన ఎస్ఆర్ 125 మీద ఓ లుక్కేసుకోండి....

అప్రిలియా ఎస్ఆర్ 125

సాంకేతికంగా, అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌లో 124.49సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది 9.46బిహెచ్‌పి పవర్ మరియు 9.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్ 125

ఎస్ఆర్ 125 స్కూటర్ ఈ సెగ్మెంట్లో అత్యంత ఖరీదైనది. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన ఎన్‌టార్క్ కంటే ఎక్కువగా ఉంది. అప్రిలియా లైనప్‌లో ఉన్న ఎస్ఆర్ 150 కంటే దీని ధర కేవలం రూ. 5,000 మాత్రమే తక్కువగా ఉంది.

అప్రిలియా ఎస్ఆర్ 125

మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే... ఎస్ఆర్ 125 పవర్ ఎస్ఆర్ 150 (10.36బిహెచ్‌పి) కంటే కొంచెం మాత్రమే తక్కువగా ఉంది. అంతే కాకుండా, టార్క్ కూడా ఎస్ఆర్ 150 కంటే కేవలం 1ఎన్ఎమ్ మాత్రమే తక్కువ.

అప్రిలియా ఎస్ఆర్ 125

బడ్జెట్ ధరలో శక్తివంతమైన పవర్‌ఫుల్ స్కూటర్ ఎంచుకోవాలనుకునే వారికి ఎస్ఆర్ 125 అత్యుత్తమ ఎంపిక. ఎస్ఆర్ 125 గరిష్ట వేగం గంటకు 115కిలోమీటర్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఇది గరిష్టంగా 120కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు టెస్ట్ రైడ్ ద్వారా తెలిసింది. అప్రిలియా ఎస్ఆర్ 125 కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎస్ఆర్ 125 అన్ని రకాల వేగాలకు తగ్గట్లుగా పవర్ అందివ్వడంలో సఫలీకృతమైంది.

అప్రిలియా ఎస్ఆర్ 125

స్పోర్టివ్ స్కూటర్ కావడంతో, అప్రిలియా ఎస్ఆర్ 125 నుండి ఎక్కువ మైలేజ్ ఆశించలేము. అయితే, ఎస్ఆర్ 125 మైలేజ్ లీటరుకు 37కిలోమీటర్లుగా ఉంది. 6.5-లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంకు మరియు ఈ మైలేజీతో అద్భుతమైన రైడింగ్స్ చేయవచ్చు.

అప్రిలియా ఎస్ఆర్ 125

ఎలాంటి మలుపులనైనా సునాయసంగా అధిగమించేలా అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను డిజైన్ చేశారు. ప్రతి అవరోధాన్ని మరియు మలుపును ఎంతో అవలీలగా చేధిస్తుంది. సీటు ఎత్తు 780ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎమ్ఎమ్‌గా ఉంది.

అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా ఎస్ఆర్ 125 మొత్తం బరువు 122కిలోలు, దీంతో చాలా తేలికగా, హుషారుగా రైడింగ్ చేసే ఫీల్ పొందుతారు. స్టోరేజ్ విషయంలో కాస్త నిరుత్సాహపరుస్తుంది. కనీసం ఇందులో సగం హెల్మెట్ కూడా పట్టదు.

అప్రిలియా ఎస్ఆర్ 125

బుకింగ్స్ విషయానికి వస్తే, ఫిబ్రవరి 2018 నుండి పేటిఎమ్ మాల్ యాప్ నుండి అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే రూ. 5,000 లు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే, క్యాష్‌బ్యాక్ పొందాలంటే www.apriliasr.in వెబ్‌సైట్లో కస్టమర్ రిజిస్టర్ చేసుకోవాలి.

అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా ఎస్ఆర్ 125 మీద వెయిటింగ్ పీరియడ్ 15 నుండి 20 రోజుల వరకు ఉంది. డీలర్‌షిప్ లొకేషన్ బట్టి వెయిటింగ్ పీరియడ్‌లో వ్యత్యాసం ఉండవచ్చు.

అప్రిలియా ఎస్ఆర్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా ఎస్ఆర్ 125 స్పోర్టివ్ స్కూటర్‌‌గా రాణించలానే లక్ష్యంతో ఉంది. కానీ, వాస్తవికం మీద తక్కువ దృష్టి పెట్టింది. శక్తివంతమైన మరియు ఖరీదైన స్పోర్ట్స్ బైకులను కొనడానికి తల్లిదండ్రులు అడ్డుపడే యువ కస్టమర్లు అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను ఎంచుకోవచ్చు.

అప్రిలియా ఎస్ఆర్ 125

1. ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

2.ప్రాణాలతో బయటపడాతా అనుకోలేదు!!

3.[వీడియో] కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

4.కనీవిని ఎరుగని సేల్స్‌తో హోండాకు చుక్కలు చూపిస్తున్న డబ్ల్యూఆర్-వి

5.డిజైర్ మీద మారుతి చేస్తున్న ప్రయోగం బట్టబయలు

English summary
Read In Telugu: Aprilia SR 125: Top Things To Know About The Light Italian Commuter
Story first published: Wednesday, April 4, 2018, 18:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark