బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 మోటార్‌సైకిల్‌కు వీడ్కోలు

Written By:

పూనే ఆధారిత దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో ఉన్న ఎంట్రీ లెవల్ మోడల్ పల్సర్ ఎల్ఎస్ 135 మోటార్ సైకిల్‌ను విపణి నుండి తొలగించిందని ఇది వరకటి కథనంలో పేర్కొన్నాము. అయితే, పల్సర్ ఎల్ఎస్ 135 తరువాత ఇప్పుడు ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్ అవెంజర్ స్ట్రీట్ 150 బైకును తమ అధికారిక లైనప్‌ నుండి తొలగించింది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

బజాజ్ షోరూముల్లో ఇక మీదట అవెంజర్ స్ట్రీట్ 150 బైకు ఇక మీదట ఉండదనే ఆలోచనలో కస్టమర్లు ఉంటే, బజాజ్ ఆటో మాత్రం. దీనిని శాశ్వతంగా తొలగించడం లేదు దీని స్థానంలో మరో 30సీసీ ఎక్కువ కెపాసిటి గల అవెంజర్ స్ట్రీట్ 180 కి అప్‌గ్రేడ్ చేసినట్లు చెబుతోంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

స్ట్రీట్ 150 స్థానంలోకి స్ట్రీట్ 180 వచ్చినప్పటికీ, ఏదేమైనా ఇక మీదట అవెంజర్ స్ట్రీట్ 150 లభించడం అసాధ్యమే. అవెంజర్ స్ట్రీట్ 150 బైకును తొలగించడంతో 180సీసీ అవెంజర్ స్ట్రీట్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ క్రూయిజర్ బైకుగా నిలిచింది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

బజాజ్ ఆటో అవెంజర్ స్ట్రీట్ 180 మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి నెలలో విపణిలోకి లాంచ్ చేసింది. డిజైన్, బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ పరంగా అచ్చం స్ట్రీట్ 220 బైకునే పోలి ఉండే అవెంజర్ స్ట్రీట్ 180 ప్రారంభ ధర రూ. 83,475 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

సాంకేతికంగా బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 బైకులో 178.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 15.3బిహెచ్‌పి పవర్ మరియు 13.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 13-లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ఉంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

నిజానికి శక్తివంతమైన అవెంజర్ స్ట్రీట్ 180 విడుదల కోసమే 150 మోడల్‌ను విపణి నుండి తొలగించారు. కానీ, రెండింటి మధ్య ధరల పరంగా పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ క్రూయిజర్ డిజైన్ మరియు శక్తివంతమైన ఇంజన్ గల అవెంజర్ స్ట్రీట్ 180 బైకును ధరకు తగ్గ విలువలతో ఎంచుకోవచ్చు.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ తమ అవెంజర్ స్ట్రీట్ 180 కోసం మార్గం సుగమం చేసేందుకు అవెంజర్ స్ట్రీట్ 150 బైకును విపణి నుండి తప్పించింది. కానీ, బజాజ్ మాత్రం దీనిని డిస్కంటిన్యూ కాకుండా అప్‌గ్రేడ్ అంటోంది. ఏదేమైనప్పటికీ అవెంజర్ స్ట్రీట్ 150 కస్టమర్లకు ఇది కాస్త నిరాశను మిగిల్చినప్పటికీ, 180 మోడల్‌ ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150

1.హోండా సిబిఆర్250ఆర్ విడుదల: ధర రూ. 1.64 లక్షలు

2.125సీసీ స్కూటర్ కొంటున్నారా...? అయితే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!!

3.విడుదలకు సిద్దమైన ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్: ధర మరియు ఇతర వివరాలు

4.టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి: మిడిల్ క్లాస్ రేసింగ్ ప్రియుల బెస్ట్ ఛాయిస్

5.కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు: వీడియో

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Avenger Street 150 Discontinued In India
Story first published: Saturday, April 7, 2018, 13:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark