బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

దేశీయ వాహనాల తయారక సంస్థ బజాజ్ ఆటో ఈ వెనుకే తమ పల్సర్ క్లాసిక్ 150 బైకులను విడుదల చేసింది. ఇప్పుడు బజాజ్ సంస్థ పల్సర్ ప్రియులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. మార్కెట్లో ఎంతగానో పాపులర్ అయిన పల్సర్ 150 క్లాసిక్ బైకులను కొత్త రంగులలో పరిచయం చేసింది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

బజాజ్ సంస్థ ఇదే ఏడాది జూన్ నెలలో తమ పల్సర్ 150 క్లాసిక్ బైకులను విడుదల చేసింది, కానీ అప్పుడు కేవలం ఒక రంగులో మాత్రమే అమ్మబడుతుండేది. కానీ ఇప్పుడు బజాజ్ సంస్థ బ్లాక్ తో పాటు రెడ్ హైలైట్స్ మరియు బ్లాక్ తో పాటు సిల్వర్ హైలైట్స్ అనే కొత్త రంగులను ఇచ్చి గ్రాహకులకు ఎంపిక చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

కేవలం కొత్త రంగులను పొందిన బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 బైక్ ధరలో గాని లేకా తాంత్రికంగా గాని ఎలాంటి మార్పిడులు పొందుండదు. బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బైక్ ముంబై ఎక్స్ శోరం ప్రకారం రూ. 65,500 రూపాయలకు అమ్మబడుతోంది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

కొత్త రంగులను పల్సర్ 150 క్లాసిక్ బైక్ లైట్ క్లస్టర్, బ్యాడ్జింగ్, గ్రాబ్ హ్యాండల్, రియర్ టేప్ మరియు పౌక్స్ వెంట్స్ భాగాల మీద ఇచ్చారు. ఇంకా రెడ్ రంగుల బైకులలో దాని సిట్ పైన ఎర్ర రంగు స్టిచ్చింగ్ మరియు శివారు వర్షన్ రంగులను ఇచ్చింది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

పల్సర్ 150 బైకులో ఎన్నో ఫీచర్లు మరియు డిజైన్ అంశాలు ఈ పల్సర్ 150 క్లాసిక్‌లో రాలేదు. దాంతో తక్కువ ధరలో తీసుకురావడానికి సాధ్యమైంది. ప్రాథమిక డిజైన్ పరంగా రెండు బైకులు ఒకేలా ఉంటాయి. కానీ తక్కువ ధరలో అందించే ఉద్దేశ్యంతో క్లాసిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

బజాజ్ అతి త్వరలో పల్సర్ 150 బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందించే అవకాశం ఉంది. కానీ, క్లాసిక్ వేరియంట్లో వచ్చే అవకాశం లేదు. అయితే ఏప్రిల్ 2019 నుండి ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరి కానుండటంతో రెండింటిలో ఏబిఎస్ వచ్చే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బ్లాక్ కలర్‌లో మాత్రమే కాకుండా ఇప్పుడు మరిన్ని రంగులలో లభ్యం కానుంది. 2018 పల్సర్ 150 తరహాలోనే క్రాంకేస్, ఫ్రంట్ ఫోర్క్స్, చైన్ గార్డ్ మరియు అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బైకులో రెగ్యులర్ పల్సర్ 150లో ఉన్నటువంటి అదే 150సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 14బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 13.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

పల్సర్ 150 క్లాసిక్ బైకులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తప్పనిసరిగా రానుంది. లేటెస్ట్ వెర్షన్‌లో మల్టిపుల్ స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి, ఇంజన్‌లో ట్విన్-స్పార్క్ ప్లగ్ హెడ్ ఉంది. ఫ్రంట్ వీల్‌కు డిస్క్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ ఉంది.

బజాజ్ పల్సర్ క్లాసిక్ 150 ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జ్‌డ్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. మరియు రెండు చక్రాలకు ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Bajaj Pulsar 150 Classic gets new colours, priced at Rs 65,500.
Story first published: Thursday, November 22, 2018, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X