బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్: ఇండియన్ మార్కెట్ కోసం కాదంట!!

Written By:
Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark

బజాజ్ ఆటో టర్కీలో జరుగుతున్న ఇస్తాంబుల్‌ మోటార్ షోలో సరికొత్త పల్సర్ ఎన్ఎస్200 బైకును అడ్వెంచర్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. పల్సర్ ఎన్ఎస్200 బైకులో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

డిజైన్ మరియు మెకానికల్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, టూరింగ్ సెగ్మెంట్లోకి వచ్చిన ఇండియన్ నేక్డ్ స్ట్రీట్ మోటార్ సైకిల్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్ బైకులోని ప్రత్యేకత ఏంటో చూద్దాం రండి...

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్‌ బైక్ ఎక్ట్సీరియర్ బాడీ పెయింట్ మీద పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు హెడ్‌లైట్ గ్రిల్, నకుల్ గార్డ్స్, ఇంజన్ బాష్ ప్లేట్, మరియు ఆక్సలరీ లైట్లు వంటి అడ్వెంచర్ ఫీచర్లు వచ్చాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

ఫ్రంట్ కౌల్ మరియు రేడియేటర్ వద్ద అల్యూమినియం సొబగులు అందివ్వడంతో అడ్వెంచర్ లుక్ సొంతం చేసుకుంది. వీటితో పాటు రీడిజైన్ చేయబడిన పిలియన్ గ్రాబ్ రెయిల్, బైకు వెనుక చివరిలో టాప్ బాక్స్ కోసం లగేజ్ ర్యాక్ మరియు హ్యాండిల్ బార్ మీద న్యావిగేషన్ డివైజ్ వంటివి ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

సాంకేతికంగా, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్‌లో 200సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 24బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ టార్క్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా రియర్ వీల్‌కు అందుతుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు మరియు రెండు బ్రేకులకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్‌ బైకును దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో విడుదల గురించి ఎలాంటి బజాజ్ ఆటో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్‌లో పరిచయం చేసిన ఫీచర్లను మరియు స్టైలింగ్ అంశాలను ప్రత్యేక కిట్ ద్వారా డామినర్ 400లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెగ్యులర్ వెర్షన్ పల్సర్ ఎన్ఎస్200తో పోల్చుకుంటే అడ్వెంచర్ ఎడిషన్ కాస్త భిన్నంగా ఉంది. అయితే, అడ్వెంచర్ మోటార్ సైకిళ్లలో రైడర్లు ఆశించే లాంగ్-ట్రావెల్ గల సస్పెన్షన్ మరియు విండ్‌స్క్రీన్ వంటి అత్యంత ముఖ్యమైన ఫీచర్లు ఇందులో లోపించాయి. కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో ఆవిష్కరించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

Image Courtesy: SurmeKlazim

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 అడ్వెంచర్ ఎడిషన్

డీజిల్ రైలింజన్లను అస్సలు ఆఫ్ చేయరెందుకు?

సరిహద్దులో హద్దు మీరితే ఇక మీదట సమాధానం చెప్పేది ఇవే!!

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar NS200 Adventure Edition Unveiled — Specifications. Features And Images
Story first published: Tuesday, February 27, 2018, 17:58 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark