హీరో ఎక్స్‌‌పల్స్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ రివీల్

Written By:
Recommended Video - Watch Now!
Ford Freestyle Walk-Around In 360

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇంజన్ వివరాలు లీక్ అయ్యాయి.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

హీరో మొదటిసారిగా ఈ ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ఇటలీలో జరిగిన 2017 ఐక్మా మోటార్ సైకిల్ షో వేదిక మీద ఆవిష్కరించింది. ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకును ఫిబ్రవరి 7 నుండి 14, 2018 మధ్య జరగనున్న ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందిస్తున్నట్లు తెలిసింది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 18.1బిహెచ్‌పి పవర్ మరియు 17.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

హీరో మోటోకార్ప్ ఇటీవల ఆవిష్కరించిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకులో ఈ ఇంజన్‌‌ను ఎక్స్‌పల్స్ మోటార్ సైకిల్‌లో అందిస్తున్న విషయాన్ని హీరో మోటోకార్ప్ అధికారి ఒకరు స్పష్టం చేసారు.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

హీరో గతంలో ప్రవేశపెట్టిన ఇంపల్స్ 150 ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ స్థానాన్ని ఈ సరికొత్త ఎక్స్‌పల్స్ భర్తీ చేయనుంది. ఆధునిక మరియు క్లాసిక్ డిజైన్, గుండ్రటి హెడ్ ల్యాంప్, కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్, స్పోక్ వీల్స్, పొడవాటి ట్రావెల్ ఉన్న సస్పెన్షన్ మరియు రైడింగ్ యాక్ససరీలు ఇందులో ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

2017 ఐక్మా మోటార్ సైకిల్ షోలో ప్రదర్శించబడిన హీరో ఎక్స్‌పల్స్ బైకులో హ్యాండిల్ ఆఫ్ రోడింగ్ కోసం అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర అడ్వెంచర్ బైకుల తరహాలో ఎత్తైన సీటు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా అందించే అవకాశాలు ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైకును 2018 చివరి నాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిల్‌కు పోటీనివనున్న ఎక్స్‌పల్స్ భారతదేశపు చీపెస్ట్ అడ్వెంచర్ బైకుగా నిలవనుంది.

హీరో ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత సరసమైన కమ్యూటర్ మోటార్ సైకిళ్లను తయారు చేసే కంపెనీగా హీరో మోటోకార్ప్ ప్రసిద్దిగాంచింది. అయితే, 2018 నుండి ఖరీదైన మరియు పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మరియు ఎక్స్‌పల్స్ బైకులను సిద్దం చేసింది.

హీరో ఎక్స్‌పల్స్ ప్రారంభ ధర రూ. 1.2 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. హీరో ఎక్స్‌పల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిజేయండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Hero XPulse Technical Details Revealed — To Be Showcased At Auto Expo 2018
Story first published: Wednesday, January 31, 2018, 18:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark