మొన్నటి వరకు బుల్లెట్ మీద ఇప్పుడు డ్యూక్ మీద నిప్పులు చెరుగుతున్న డామినర్ 400

Written By:
Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark

మార్కెట్లో డామినర్ 400కు సరాసరి పోటీనిస్తున్న మోడళ్లు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మరియు క్లాసిక్ 350. ఈ రెండింటిని ఎంచుకోవడం ఎంత దండగో అని వివరిస్తూ హాతీ మత్ పాలో(ఎనుగును పెంచకండి) అనే కాన్సెప్ట్‌తో యాడ్ వీడియోను రిలీజ్ చేసి డామినర్ 400 ఎంతో ఉత్తమమైనదో వివరించింది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

ఒకరంగా చూస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంతగానో ఇష్టపడే ఫ్యాన్స్ కూడా నిజమే కదా అనేలా ఉన్నాయి ఆ వీడియోలు. క్రూయిజర్ సెగ్మెంట్లో ఉన్న బైకులకు పోటీనిచ్చిన డామినర్ 400 నేక్డ్ స్పోర్ట్స్ బైకు డ్యూక్ 390కు సరైన పోటీనివ్వలేకపోయింది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

అయితే, తాజాగా బెంగళూరుకు చెందిన కస్టమైజేషన్ బృందం చేసిన ప్రయోగం ఫలిచడంతో డామినర్ 400 ఇక మీదట కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌కు కూడా గట్టి పోటీనివ్వనుంది. నిజమే, ఈ మోడిఫైడ్ వెర్షన్ డామినర్ 400 రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్ బైకులకు మరియు కెటిఎమ్ 390 ఇంజన్‌ కన్నా అత్యధిక పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

పవర్ తక్కువగా ఉత్పత్తి చేస్తుందనే కారణం చేత డ్యూక్ 390 డామినర్ 400ను పోటీ నుండి వెలివేసింది. అయితే, బెంగళూరుకు చెందిన "రేస్ కాన్సెప్ట్స్" బృందం చేసిన ఇంజనీరింగ్ అద్భుతంతో డామినర్ 400 ఇంజన్ పవర్ 20 శాతం పెరిగింది. దీంతో డామినర్ 400 ఇప్పుడు డ్యూక్‌తో పాటు రేస్‌కు సిద్దమైంది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

బజాజ్ డామినర్ 400 లోని 373సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ 27బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైకు రియర్ వీల్ ద్వారా పరీక్షించినపుడు ఈ ఫలితాలు వచ్చాయి. ఇంజన్ నుండి పవర్ వీల్‌కు చేరడానికి మధ్య అందించిన ట్రాన్స్‌మిషన్ సెటప్ కారణంగా ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ చక్రానికి చేరదు.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

కాని కంపెనీలు మాత్రం, ఇంజన్ క్రాంక్‌షాఫ్ట్(క్రాంక్‌షాప్ట్ అనంతరం గేర్‌బాక్స్ ద్వారా పవర్ వీల్స్‌ను చేరుతుంది) వద్ద పవర్ మరియు టార్క్ వివరాలను సేకరించి ప్రచారం చేసుకుంటాయి. అందుకే చాలా వరకు కంపెనీలు ఇచ్చిన పర్ఫామెన్స్ వివరాలు రియల్ లైఫ్‌లో నడుపుతున్నపుడు పర్ఫామెన్స్‌కు ఏ మాత్రం సరిపోలవు. అంటే దీని ప్రకారం, కంపెనీ చెప్పిన పవర్ ఇంజన్ నుండి వీల్‌కు అందే సరికి 10 నుండి 20 శాతం తగ్గిపోతుంది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

రేస్ కాన్సెప్ట్ కస్టమైజేషన్ బృందం డామినర్ 400 బైకులోని ఇంజన్‌లో మోడిఫికేషన్స్ నిర్వహించింది. డామినర్‌లోని ఇంజన్ హెడ్‌లో మార్పులు, ఇంజన్-క్లచ్-గేర్ సిస్టమ్‌ను తొలగించి రీపొజిషన్ చేయడం, ఇంజన్‌లోకి గాలి సులభంగా వెళ్లడం మరియు ఎగ్జాస్ట్ నుండి పొగ వదులుగా వెళ్లిపోయే విధంగా ఇంజన్‌లో ఎన్నో మార్పులు చేర్పులు నిర్వహించారు.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

రేస్ కాన్సెప్ట్స్ నిర్వహించిన కస్టమైజేషన్ అనంతరం డామినర్ 400 సుమారుగా 33.4బిహెచ్‌పి పవర్ మరియు 32.1ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేసింది. అంటే రెగ్యులర్ డామినర్‌లో చక్రానికి అందుతున్న పవర్ మరియు టార్క్‌తో పోల్చుకుంటే ఇది 20 శాతం ఎక్కువ.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

అంటే కంపెనీల లెక్కల ప్రకారం, ఇంజన్ వద్ద బైకు పవర్ మరియు టార్క్ లెక్కిస్తే ఈ మోడిఫైడ్ డామినర్ 400లో ఇంజన్ క్రాంక్‌షాప్ట్ వద్ద 40బిహెచ్‌పి పవర్ మరియు 40ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్ సైకిల్ పనితీరుకు ఈ మోడిఫైడ్ డామినర్ 400 పనితీరు చాలా దగ్గరగా ఉంటుంది.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

రేస్ కాన్సెప్ట్స్ వారి మోడిఫైడ్ డామినర్ 400 పర్ఫామెన్స్ బజాజ్ వారి డామినర్ తరహా పనితీరు కంటే ఎక్కువ. కాబట్టి, ధర కూడా బజాజ్ డామినర్ 400 ఎక్స్-షోరూమ్ కంటే ఎక్కువ. క్రూయిజ్ మరియు రేసింగ్ రెండు అనుభవాలను పొందాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ మరియు కెటిఎమ్ లక్షణాలు ఉన్న మోడిఫైడ్ డామినర్ 400 బెస్ట్ ఛాయిస్.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

అత్యుత్తమ పవర్ ఇవ్వగల మోడిఫైడ్ డామినర్ 400 కావాలనుకుంటే బెంగళూరుకు చెందిన కస్టమైజేషన్ బృందం రేసింగ్ కాన్సెప్ట్స్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా వారిని సంప్రదించి ధర మరియు ప్రాసెస్ వివరాలను కనుక్కోగలరు.

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్‌కు ప్రచారం చాలా ఎక్కువగానే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌కు సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. నాణ్యత, పనితీరు, సేఫ్టీ, డిజైన్, స్టైల్ మరియు కొన్ని వేల కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్ చేసే సామర్థ్యాలు ఉండటంతో డామినర్ 400కు విదేశాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కస్టమైజ్డ్ డామినర్ 400 కూడా బజాజ్ సంస్థకు తోడ్పాటునందివ్వనుంది. రేసింగ్ కాన్సెప్ట్స్ డామినర్ 400 సక్సెస్ అయితే డామినర్ మోడల్ బజాజ్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టినట్లే...

మోడిఫైడ్ బజాజ్ డామినర్ 400

బజాజ్‌ బుర్రకు తట్టని ఐడియా !!

రాయల్ ఎన్ఫీల్డ్‌కు ప్రాణం పోసిన కస్టమైజేషన్

సుజుకి హయాబుసా రూపంలోకి మారిపోయిన హీరో ఎక్స్‌ట్రీమ్

English summary
Read In Telugu: Race Concepts Dominar 400 Is India's Most Powerful - No Haathis Can Catch This
Story first published: Monday, February 26, 2018, 10:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark