ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల: ధర జస్ట్ 48 లక్షలు మాత్రమే

Written By:

అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం ఇండియన్ మోటార్ సైకిల్స్ విపణిలోకి ఖరీదైన ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ ధర అక్షరాల నలభై ఎనిమిది లక్షల రుపాయలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. బెస్పోక్ పెయింట్ ఫినిషింగ్‌లో ఉన్న ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతోంది.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్

ఇండియన్ మోటార్‍‌సైకిల్స్ ఈ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకులను కేవలం300 సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేయనుంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే విడుదలకు ముందే అన్ని మోడళ్లు అమ్ముడయ్యాయి. రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకులో క్యాడీ బ్లూ మరియు బ్లాక్ కాంబో రంగులతో సుమారుగా 30 పని గంటలు పని సమయాన్ని వెచ్చించి చేతితో పెయింటింగ్ చేశారు.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

మరో ప్రధాన హైలెట్ బంగారు సొబగులు. మీరు చదివింది నిజమే, రోడ్‌మాస్టర్ అనే బ్యాడ్జింగ్‌ను 23 క్యారట్ గోల్డ్ ఫినిషింగ్ చేయబడింది.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

సాంకేతికంగా ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకులో 1811సీసీ కెపాసిటి గల థండర్ స్ట్రోక్ 111 వి-ట్విన్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 161ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

రోడ్‌మాస్టర్ ఎలైట్ అల్ట్రా-క్రూయిజర్ బైకులో ఎన్నో అత్యాధునిక పరికరాలతో పాటు రెగ్యులర్ రోడ్‌మాస్టర్ నుండి సేకరించిన ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకులోని కొన్ని ప్రధాన ఫీచర్ల మీద ఓ లుక్కేసుకుందాం రండి...

  • బ్లూటూత్ న్యావిగేషన్, వెహికల్ స్టేటస్ మరియు స్ల్పిట్ స్క్రీన్ గల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న రైడ్ కమాండ్ సిస్టమ్ ఉంది.
  • గోల్డ్ ప్లేటెడ్ ఇంజన్ కవర్లు
  • రిమోట్ లాకింగ్ సిస్టమ్ గల సైడ్ బ్యాగులు
  • అంతర్గతంగా వైరింగ్ చేయబడిన హ్యాండిల్‌బార్
  • పవర్ విండ్‌షీల్డ్
  • 300వాట్ ఆడియో సిస్టమ్
ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

రియాలిటీలో ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ అత్యద్బుతమైన రైడింగ్ కంఫర్ట్ మరియు నాణ్యమైన విడి భాగాలు ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ శాడిల్ బ్యాగులు, రెండు బాక్సుల్లో మరియు అన్ని ప్రదేశాల్లో ఉన్న స్టోరేజ్ స్పేస్ కలుపుకుంటే మొత్తం 140లీటర్ల లగేజ్ స్పేస్ ఇండియన్ రోడ్‌మాస్టర్ సొంతం.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

స్పెషల్ మరియు లిమిటెడ్ ఎడిషన్ ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకులో అన్ని యాక్ససరీలను కలుపుకుని కంప్లీట్ కిట్ అందివ్వడం జరిగింది. ఇండియన్ రోడ్‌మాస్టర్ నిజానికి చాలా హెవీ బైకు. దీని మొత్తం బరువు 433కిలోలుగా ఉంది.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

బైక్ సేఫ్టీ విషయానికి వస్తే, ఇండియన్‌ రోడ్‌మాస్టర్‌లో ముందు వైపున 300ఎమ్ఎమ్ చుట్టుకొలత గల ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున అదే కొలతలో ఉన్న సింగల్ డిస్క్ బ్రేక్ ఉంది. రైడింగ్ అసిస్ట్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తప్పనిసరిగా వచ్చాయి. రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

ఇండియన్ మోటార్‌సైకిల్స్ టాప్ ఎండ్ మోడల్ ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్‌కు హ్యార్లీ-డేవిడ్సన్ సివిఒ మోడల్ సరాసరి పోటీనిస్తుంది. దీని ధర రూ. 49.99లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఖరీదైన క్రూయిజర్ మోటార్ సైకిళ్లను ఎంచుకునే ఔత్సాహికులు ఎంతగానో ఇష్టపడే మోడల్ ఇండియన్ రోడ్‌మాస్టర్. లోకో మోటివ్ ప్రేరణతో వచ్చిన డిజైన్ లాంగ్వేజ్ మరియు ఇండియన్ మోటార్‌సైకిల్స్ వారసత్వ లక్షణాలతో వచ్చిన రోడ్‌మాస్టర్ కస్టమర్లకు డబ్బు కంటే విలువైనదిగా నిలిచింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఎలైట్ ఎడిషన్ బైకులో వచ్చిన 23 క్యారట్ గోల్డ్ ఫినిషింగ్ దీని వ్యాల్యూ గురించి చెపుతుంది.

English summary
Read In Telugu: Indian Roadmaster Elite Launched In India At Rs 48 Lakh: Limited To 300 And Comes With 23 Karat Gold
Story first published: Thursday, May 3, 2018, 14:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark